ఫ్యాటీ లివర్‌ను చాలామంది ఒక చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఎటువంటి నొప్పి లేదా లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని ‘సైలెంట్ డిసీజ్’ అని పిలుస్తారు. కానీ, దీనిని వదిలేస్తే అది ఫైబ్రోసిస్ లేదా సిరోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. డాక్టర్ హర్ష్ వ్యాస్ సోషల్ మీడియాలో ఒక రోగి కేస్ స్టడీని పంచుకున్నారు. ఆ రోగి కేవలం రెండే రెండు మార్పులతో తన కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చుకున్నాడు.
ఆ రెండు కీలక మార్పులు ఇవే:
- వారానికి ఒకసారి 24-36 గంటల ‘వాటర్ ఫాస్టింగ్’ (నీటి ఉపవాసం):
మీరు ఎక్కువ సమయం ఆహారం తీసుకోనప్పుడు, శరీరం మొదట కాలేయంలో దాగి ఉన్న గ్లైకోజెన్‌ను శక్తిగా వాడుకుంటుంది. అది అయిపోగానే, కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును (ట్రైగ్లిజరైడ్స్) కరిగించడం మొదలుపెడుతుంది. అంటే మీ శరీరం ‘స్టోరేజ్ మోడ్’ నుండి ‘ఫ్యాట్ బర్నింగ్ మోడ్’కు మారుతుంది. - వారానికి 4-5 రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్ (Strength Training):
కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Resistance Training) చేయడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల రక్తంలోని గ్లూకోజ్ కండరాల ద్వారా వినియోగించబడి, కాలేయంలో కొత్తగా కొవ్వు చేరకుండా ఆపుతుంది.
పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?
క్లినికల్ ట్రయల్స్ ప్రకారం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting) మరియు వ్యాయామం కలిపి చేయడం వల్ల కాలేయ ఎంజైములు (SGPT/ALT) తగ్గుతాయి, వాపు తగ్గుతుంది మరియు కాలేయంలోని కొవ్వు 5-6% వరకు తగ్గుతుంది.
