బ్యాంకుల E-KYC విధానంలో కొత్త ట్విస్ట్; జాలి, దయ చూపిస్తే మునిగిపోవడం ఖాయం!

కేవలం 30 నిమిషాల్లో మిమ్మల్ని మీరు ఊహించని అప్పుల ఊబిలోకి నెట్టేయగలరు. ప్రస్తుతం AI సాయంతో జరుగుతున్న ఒక కొత్త రకం మోసం దీనికి కారణం.

ప్రస్తుతం అనేక బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు E-KYC విధానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇందులో పత్రాల అవసరం లేకుండా, ముఖ గుర్తింపు (Facial Recognition) మరియు మొబైల్ OTP ఉంటే చాలు.. 5 నుండి 10 నిమిషాల్లో లోన్ మంజూరవుతుంది. మీ గుర్తింపును ఉపయోగించి వారు తీసుకున్న లోన్ మొత్తాన్ని మరో ఖాతాలోకి మార్చేసి, ఫోన్ మీ చేతిలో పెట్టి మాయమైపోతారు.

వృద్ధులే లక్ష్యంగా మోసాలు: ఈ మోసగాళ్లు మెట్రో స్టేషన్లు, మాల్స్, మార్కెట్లు వంటి జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అమాయకపు వృద్ధులను లేదా మధ్యవయస్కులను లక్ష్యంగా చేసుకుంటారు. “నాకు ఫోన్ వాడటం తెలియడం లేదు, నా పెన్షన్ వచ్చిందో లేదో చూసి చెప్పండి” అని ప్రాధేయపడతారు. లేదా “ఏదో తప్పుడు బటన్ నొక్కాను, కొంచెం సరిచేయండి” అని సాయం కోరుతారు.

మీరు సాయం చేద్దామని వారి ఫోన్ తీసుకున్నప్పుడు.. అందులో బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో కాల్ లేదా స్క్రీన్ రికార్డింగ్ ఆన్‌లో ఉంటుంది. కెమెరా మీ ముఖాన్ని స్కాన్ చేస్తూ ఉంటుంది. ఇది సాధారణ మోసం కాదు, దీనిని ‘AI ఐడెంటిటీ బయోమెట్రిక్ స్కామ్’ అంటారు.

మీ డిజిటల్ క్లోన్ తయారీ: మీరు ఆ ఫోన్ స్క్రీన్‌ను టచ్ చేసినప్పుడు లేదా వారి వైపు చూసినప్పుడు, మీ వేలిముద్రలు (Fingerprints), ముఖ నిర్మాణం మరియు గొంతు (Voice) డేటాను వారు సేకరిస్తారు. ఆధునిక AI సాంకేతికతను ఉపయోగించి మీలాగే అచ్చుగుద్దినట్టు ఉండే **’డిజిటల్ క్లోన్’**ను తయారు చేస్తారు.

దీని ద్వారా స్కామర్లు మీరే స్వయంగా వీడియోలో మాట్లాడుతున్నట్లు సృష్టించి.. ఆన్‌లైన్ లోన్లు, క్రెడిట్ క్యాష్ వంటివి మీ ముఖ మరియు వాయిస్ గుర్తింపుతో తీసేసుకుంటారు. కేవలం 30 నిమిషాల్లో మీ పేరు మీద లక్షలు లేదా కోట్లలో అప్పులు జమ అవుతాయి.

జాగ్రత్తలు ఇవే:

  • ముఖం తెలియని వ్యక్తులకు సాయం చేయబోయి చిక్కుల్లో పడకండి.
  • గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లను తీసుకుని వాడకండి. వారి ఫోన్ స్క్రీన్‌ను అస్సలు చూడకండి.
  • తెలియని వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ అంగీకరించకండి.
  • ఎవరైనా “కెమెరా వైపు చూడండి” అని చెబితే అస్సలు సహకరించకండి.
  • ఆధార్ బయోమెట్రిక్ లాక్: మీ ఆధార్ వేలిముద్ర మరియు ముఖ గుర్తింపును m-Aadhar యాప్ ద్వారా ‘లాక్’ చేసి ఉంచండి. అప్పుడు మీ అనుమతి లేకుండా ఎవరూ మీ ఐడెంటిటీని వాడలేరు.

Posted

in

by

Tags: