పెళ్లయిన ప్రతి జంట హనీమూన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. కొందరైతే పెళ్లికి ముందే ప్లాన్ చేసుకుంటారు. హనీమూన్ అనేది దంపతులు ఇద్దరూ ప్రపంచాన్ని మరచి ఒకరితో ఒకరు ఏకాంతంగా గడిపే సమయం. ఇది అత్యంత వ్యక్తిగతమైన (Private) విషయం. అలాంటి సమయంలో స్నేహితులు కానీ, బంధువులు కానీ ఉండాలని ఎవరూ కోరుకోరు.
హనీమూన్కు స్నేహితులకు ఆహ్వానం
అయితే ఒక వరుడు మాత్రం తన హనీమూన్కు భార్యతో పాటు తన స్నేహితుల బృందాన్ని కూడా రమ్మని ఆహ్వానించాడు. స్నేహితులు ఎంత అల్లరి చేస్తారో అందరికీ తెలిసిందే. అలాంటి ప్రైవేట్ సమయంలో స్నేహితులు ఉండటం భార్యకు ఎంత అసౌకర్యంగా ఉంటుందో అతను ఆలోచించలేదు. పెళ్లికి ముందే తన హనీమూన్ ప్లాన్ చేసే బాధ్యతను కూడా తన స్నేహితులకే అప్పగించాడట ఆ వరుడు.
విషయం తెలిసి నివ్వెరపోయిన భార్య
పెళ్లయ్యాక హనీమూన్ వెళ్లే సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. అది వినగానే ఆమె ఒక్కసారిగా షాక్కు గురైంది. భర్తపై విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, అతని స్నేహితులకు కూడా గట్టిగా బుద్ధి చెప్పింది.
ఆ వధువు ఈ వింత అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “నువ్వు ఒక నంబర్ వన్ తెలివితక్కువ వాడివి” అంటూ తన భర్తను తిట్టినట్లు పేర్కొంది. హనీమూన్కు వేరే ఎవరైనా వస్తే తాను అసలు వచ్చేదే లేదని కరాఖండిగా చెప్పేసింది.
చివరికి ఏమైందంటే?
భర్త ఆమెను ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వినలేదు. దాంతో చేసేదేమీ లేక అతను తన స్నేహితులకు అసలు విషయం చెప్పేశాడు. అయితే చివరికి ఆ స్నేహితులు వారితో వెళ్లారా లేదా అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.
