నేటి ఉరుకుల పరుగుల జీవితం, సక్రమంగా లేని ఆహారపు అలవాట్లు మరియు ఎక్కువ సమయం గదుల్లోనే గడపడం వల్ల మన శరీరంలో అనేక పోషకాల లోపం కనిపిస్తోంది. ఫోర్టిస్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వాత్సల్య ప్రకారం.. ఒత్తిడి, చక్కెర మరియు పోషకాల లోపం మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మెజారిటీ భారతీయులకు అవసరమైన ఆ 3 సప్లిమెంట్లు ఇవే:
1. విటమిన్ డి (Vitamin D)
భారతదేశంలో ఎండకు కొదవ లేకపోయినా, దాదాపు 70-90% మంది భారతీయులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి (Immunity) మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీ కోసం ఇది చాలా అవసరం. ఇండోర్ లైఫ్ స్టైల్ వల్ల ఇది మనకు సహజంగా అందడం లేదు.
2. మెగ్నీషియం (Magnesium)
నివేదికల ప్రకారం సగం మంది భారతీయుల్లో మెగ్నీషియం లోపం ఉంది. ఇది నిద్ర నాణ్యతను పెంచడానికి, కండరాల రికవరీకి మరియు ఒత్తిడిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తగ్గిపోతున్నాయి.
3. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids)
భారతీయ ఆహారంలో ఫ్యాటీ ఫిష్ (చేపలు) వినియోగం తక్కువగా ఉండటం వల్ల మన దేశంలో ఒమేగా-3 స్థాయిలు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్నాయి. ఇది మెదడు ఆరోగ్యం, గుండె మరియు కాలేయం పనితీరుకు చాలా ముఖ్యం. రోజుకు 1-2 గ్రాముల ఒమేగా-3 తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
డాక్టర్ సలహా: ఈ సప్లిమెంట్లు తీసుకునే ముందు రక్త పరీక్షలు చేయించుకుని, డాక్టర్ సూచించిన మోతాదులోనే వాడాలి. సొంత నిర్ణయాలతో మందులు వాడటం ప్రమాదకరం.
