సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఒక ఆఫీసు ప్రవేశ ద్వారం వద్ద బూట్లు, చెప్పులు కుప్పగా పడి ఉండటం ఇందులో కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు తమకంటూ కొన్ని ప్రత్యేకమైన పాలసీలను కలిగి ఉంటాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఒక ఏఐ (AI) స్టార్టప్ కంపెనీ ఇప్పుడు తన వింత నిబంధనతో వార్తల్లో నిలిచింది. ఈ ఆఫీసులోకి వెళ్లేవారు తమ పాదరక్షలను బయటే విడిచి వెళ్లాలి. అంటే ఆఫీసు లోపలికి బూట్లతో ప్రవేశించడం నిషిద్ధం.
చర్చ ఎలా మొదలైంది? కుపర్టినోకు చెందిన డెవలపర్ ఆండ్రీ ల్యాండ్‌గ్రాఫ్ ఎక్స్ (X) వేదికగా ఒక ఫోటోను షేర్ చేయడంతో ఈ చర్చ మొదలైంది. ఆ ఫోటోలో చెక్క ఫ్లోర్‌పై అనేక జతల బూట్లు చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించవచ్చు. ఇది చూసిన నెటిజన్లు “ఇది ‘కర్సర్’ (Cursor) కంపెనీ ఆఫీసు” అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
అసలేమిటీ ‘కర్సర్’? కర్సర్ అనేది ఏఐ ఆధారిత కోడింగ్ స్టార్టప్. ఇది డెవలపర్లు కోడ్‌ను వేగంగా రాయడానికి, అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక స్మార్ట్ కోడ్ ఎడిటర్‌ను తయారు చేస్తుంది. 2022లో స్థాపించబడిన ఈ సంస్థ సహ వ్యవస్థాపకులలో అమన్ సంగర్ అనే భారతీయ మూలాలున్న వ్యక్తి కూడా ఉన్నారు.
‘నో షూ’ పాలసీ ఎందుకు? ఆఫీసు వాతావరణం ఇల్లులా హాయిగా ఉండాలని, పరిశుభ్రంగా ఉండాలని ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. ఉద్యోగులు మరింత రిలాక్స్‌గా ఫీల్ అవ్వడానికి ఈ పద్ధతి సహాయపడుతుందని కంపెనీ భావిస్తోంది.
