పురుషులకు లేని అభ్యంతరం స్త్రీలకు ఎందుకు? మెయిల్ సెక్స్ వర్కర్ ఇంటర్వ్యూపై నెట్టింట హాట్ డిబేట్!

ఒక పురుష లైంగిక కార్మికుడు ఇచ్చిన ఇంటర్వ్యూ కేరళ సోషల్ మీడియా సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో, “కపట నైతికతను” (Pseudo-morality) ఎండగడుతూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ దీపా సైరా చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

దీపా సైరా పోస్ట్‌లోని ముఖ్యాంశాలు:
  • కపట నైతికత: సమాజంలో పురుష లైంగిక కార్మికులు ఉన్నారనేది అందరికీ తెలిసిన సత్యమేనని, అయితే ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే చాలా మంది ముఖం చిట్లించుకోవడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆమె విమర్శించారు.
  • చీకట్లో ఒకటి.. వెలుగులో మరొకటి: అతిపెద్ద బలహీనత ఏమిటంటే.. చీకట్లో ఏ పనైనా చేస్తారు, కానీ అదే విషయం వెలుగులోకి వస్తే మాత్రం నీతులు చెబుతూ ఎదుటి వ్యక్తిని నేరస్థుడిగా చిత్రీకరిస్తారని ఆమె ఎద్దేవా చేశారు.
  • స్త్రీ లైంగికతపై వివక్ష: పురుషుడి కోరికలను సమాజం అంగీకరిస్తున్నప్పుడు, స్త్రీ కోరికలను ఎందుకు తప్పుబడుతున్నారని ఆమె ప్రశ్నించారు. “అంత కోరికలు ఉన్న ఆడవాళ్లు కూడా ఉంటారా?” అని కామెంట్ చేసేవారికి.. పురుషులకు సాధ్యమైనప్పుడు స్త్రీలకు ఎందుకు సాధ్యం కాదు? అని ఎదురుదాడి చేశారు.
  • వ్యక్తిగత అనుభవం: తన కాలేజీ రోజుల్లో పోర్న్ వీడియోలను, అందులో నటించేవారిని తీవ్రంగా విమర్శించే ఒక వ్యక్తి ఫోన్ చెక్ చేస్తే.. అందులో పదుల సంఖ్యలో అశ్లీల వీడియో విండోలు ఓపెన్ చేసి ఉండటాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. “నాకు కావాలి.. కానీ ఎదుటివాడు చేస్తే మాత్రం తప్పు” అనే మనస్తత్వం వల్లే ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆమె ముగింపు సందేశం:

ప్రేమ, శృంగారం అనేవి మనిషి కనీస అవసరాలని, ఈ నిజాన్ని అంగీకరించని వారే సోషల్ మీడియాలో నీతులు చెబుతుంటారని ఆమె అన్నారు. “ఎవరికి నచ్చింది వారు చేయనివ్వండి- అది ఎదుటివారిని బాధించకుండా, చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉంటే చాలు. జీవితం ఒక్కటే.. దానిని ఆస్వాదిస్తూ జీవించండి” అని దీపా సైరా తన పోస్ట్‌ను ముగించారు.


Posted

in

by

Tags: