కుక్కర్‌లో చపాతీలు చేయడం తెలుసా? సమయం, శ్రమ రెండూ ఆదా; నిమిషాల్లో మెత్తని చపాతీలు ఇలా ట్రై చేయండి!

చపాతీ అంటే మనందరికీ ఎంతో ఇష్టం. పొద్దున్న టిఫిన్ అయినా, మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి డిన్నర్ అయినా సరే.. చపాతీ అంటే ఎవరైనా ఓకే చెప్పాల్సిందే. ఏ కర్రీతోనైనా చపాతీ సెట్ అయిపోతుంది. కర్రీ లేకపోయినా సాస్ లేదా జామ్‌తో కూడా మనం లాగించేస్తాం.

కానీ, చపాతీలు చేయడం అంటే కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా ఉద్యోగస్తులు, విద్యార్థులకు ఇది పెద్ద టాస్క్. బయట దొరికే ‘హాఫ్ కుక్డ్’ చపాతీలు కొందామంటే, అవి ప్రతిరోజూ కొనడం అంత లాభదాయకం కాదు. అలాంటప్పుడు ఇంట్లోనే కుక్కర్ ఉపయోగించి చపాతీలు చేసే ఒక సింపుల్ ట్రిక్ వాడితే ఎలా ఉంటుంది? అవును, కుక్కర్ ఉంటే చాలు.. నిమిషాల్లో చపాతీలు రెడీ అయిపోతాయి. సమయం మరియు శ్రమను ఆదా చేయడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు. ప్రెషర్ కుక్కర్ వాడి రుచికరమైన, మెత్తని చపాతీలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

తయారీ విధానం: గోధుమ పిండిలో తగినంత ఉప్పు, వేడి నీళ్లు పోసి కలపాలి. పిండి కలిపేటప్పుడు కొంచెం నూనె వేస్తే చపాతీలు ఇంకా మెత్తగా వస్తాయని మనకు తెలిసిందే.

వండే పద్ధతి: ముందుగా చపాతీలను రుద్దుకోవాలి. కుక్కర్ లోపల కొంచెం నూనె రాసి, రుద్దిన చపాతీలను ఒకదానిపై ఒకటి పేర్చాలి.

ముఖ్య గమనిక: కుక్కర్‌కు విజిల్ పెట్టకూడదు. విజిల్ తీసేసి, మంటను పూర్తిగా తగ్గించి (Low Flame) కేవలం 2 నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత మూత తీసి చపాతీలను అటు ఇటు తిరగేసి మరో నిమిషం ఉంచితే.. ఎంతో సాఫ్ట్‌గా ఉండే చపాతీలు రెడీ!


Posted

in

by

Tags: