థాయ్‌లాండ్‌లో తప్పిపోయిన ఒక పెంపుడు కుక్క, రెండు వారాల తర్వాత అనుకోకుండా తన యజమానిని కలిసిన హృదయ విదారక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన కుక్క కోసం ఊరంతా వెతికి వేసారిపోయిన ఆ వ్యక్తి, ఒకరోజు దాహం వేయడంతో రోడ్డు పక్కన ఉన్న కూల్ డ్రింక్స్ షాపుకు వెళ్ళాడు. అప్పుడు అక్కడికి పరుగున వచ్చిన ఒక తెల్లటి కుక్క, అతడిని వాసన చూసి ఉత్సాహంతో ఎగరడం ప్రారంభించింది. మొదట ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి, అది తన తప్పిపోయిన పెంపుడు కుక్కేనని గుర్తించి ఆనందభాష్పాలతో దాన్ని హత్తుకున్నాడు.
ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి, ఇవి చూసిన వారందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. “నన్ను వదిలి నిమిషం కూడా ఉండలేడు, ప్రతిరోజూ నా కోసం గుమ్మం దగ్గరే వేచి చూస్తుంటాడు” అని ఆ యజమాని భావోద్వేగంతో తెలిపాడు.
వేలమంది మనుషుల మధ్యలో కూడా కేవలం తన యజమాని వాసనను బట్టి గుర్తుపట్టడమే నిజమైన విశ్వాసం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply