బెంగళూరులో తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో, ఒక జ్యోతిష్యుడి అంచనా కారణంగా విద్యాజ్యోతి అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
27 ఏళ్ల విద్యాజ్యోతి వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో ఒక జ్యోతిష్యుడు వీరి జాతకాలను చూసి.. వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం చేదుగా ఉంటుందని, నిశ్చయంగా విడాకులకు దారితీస్తుందని చెప్పాడు.
జ్యోతిష్యుడి మాటలను నిజమని నమ్మిన విద్యాజ్యోతి, ఆ జాతక దోషాన్ని తొలగించుకోవడానికి 9 రోజుల పాటు కఠినమైన పరిహార పూజలు చేసింది. ఆ తొమ్మిది రోజులూ ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. పరిహార పూజల చివరి రోజున, పూజ ముగిసిన వెంటనే తన గదిలోకి వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కలల్లో ఉన్న కుటుంబ సభ్యులు, ఆమె ప్రియుడు.. ఆ యువతి తీసుకున్న ఈ దారుణ నిర్ణయంతో కుంగిపోయారు.

Leave a Reply