అమెరికాలో మిస్టరీ భూకంపం!.. ట్రంప్ రహస్య అణు పరీక్షలు చేస్తున్నారా? తదుపరి ‘ప్లాన్’ ఏంటి?.. ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు!!

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో, అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉన్న ‘ఏరియా 52’ (Area 52) సైనిక స్థావరం సమీపంలో వరుసగా సంభవిస్తున్న శక్తివంతమైన భూకంపాలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

టోనోపా (Tonopah) ప్రాంతంలో గత వారం రోజుల్లోనే 100కు పైగా చిన్నపాటి ప్రకంపనలు, 16 సార్లు చెప్పుకోదగ్గ స్థాయి భూకంపాలు నమోదయ్యాయి.

ఇది కేవలం ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న భూకంపమేనా? లేక ఇరాన్‌తో యుద్ధాన్ని ఎదుర్కోవడానికి అమెరికా రహస్యంగా భూగర్భ అణు పరీక్షలు నిర్వహిస్తోందా? అనే ప్రశ్నలు అంతర్జాతీయ స్థాయిలో తలెత్తుతున్నాయి.

మరోవైపు, శ్రీలంక సమీపంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ధ్వంసం చేసిందనే వార్తలు యుద్ధ తీవ్రతను చాటిచెబుతున్నాయి. ఈ ఘర్షణ గనుక 10 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, అమెరికా ఆయుధశాల ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పెంటగాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం ఏదో ఒక ‘మెగా ప్లాన్’ తో రహస్యంగా ముందుకు వెళ్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Posted

in

by

Tags: