టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ఉత్కంఠ శిఖరాగ్రానికి చేరిన ఈ పోరులో సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా మైమరిచిపోయారు.
చివరి 3 ఓవర్లలో ఇంగ్లాండ్ గెలవడానికి 45 పరుగులు కావాల్సిన సమయంలో, బుమ్రా వేసిన ఒక బంతికి సాక్షి ధోనీ వికెట్ పడిపోయిందనో లేదా భారత్ గెలిచేసిందనో అనుకుని సీటులోంచి ఎగిరి గంతేశారు. నిజానికి బుమ్రా ఆ బంతిని ‘బంప్ క్యాచ్’ (నేలకు తగిలి చేతుల్లోకి రావడం) పట్టారు, కానీ అది అవుట్ కాదు. సాక్షి అత్యుత్సాహం చూసి పక్కనే ఉన్న ధోనీ మరియు అతని స్నేహితులు నవ్వు ఆపుకోలేకపోయారు. ధోనీ సైగ చేస్తూ, “ఇంకా మ్యాచ్ రిజల్ట్ రాలేదు, ముందు కూర్చో” అని ఆమెను వారించారు. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అవుతోంది.

Leave a Reply