ఇరాన్ సౌదీ అరేబియాపై దాడి చేసినప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది. అయితే, పాకిస్తాన్ మౌనంగా చూస్తూ కూర్చోవడం చూసి సౌదీ అరేబియా ఇప్పుడు పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సౌదీ అరేబియా పాకిస్తాన్‌పై ఒక పెద్ద ‘ఆర్థిక పరమైన అణుబాంబు’ ప్రయోగించింది.
అమెరికా తన గగనతలాన్ని (Air Space) వాడుకోవడానికి పాకిస్తాన్ అనుమతించినప్పుడు, ఇరాన్ దానిని ద్రోహంగా భావించింది. సరైన సమయంలో బుద్ధి చెబుతామని ఇరాన్ హెచ్చరించింది. కానీ సౌదీ అరేబియా మాత్రం అప్పుడే శిక్ష వేయడం మొదలుపెట్టింది. భారత్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం గమనార్హం. ఇకపై పాకిస్తాన్‌కు ఇచ్చే నిధుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని, కఠిన నిబంధనలు విధిస్తామని సౌదీ ప్రకటించింది. బేషరతుగా బెయిల్ అవుట్ ప్యాకేజీలు ఇచ్చే ప్రసక్తే లేదని, అసలు పాకిస్తాన్‌కు తిరిగి చెల్లించే స్తోమత ఉందో లేదో చూశాకే నిధులు ఇస్తామని సౌదీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సౌదీ అరేబియా పాకిస్తాన్‌ను ఇరాన్ కంటే పెద్ద శత్రువుగా పరిగణిస్తోంది.
షియా-సున్నీ ఘర్షణలు? ఇరాన్ దాడులు చేస్తున్నప్పుడు పాకిస్తాన్ స్పందించకపోవడంతోనే సౌదీ ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు. “మా కోసం ఇరాన్‌పై దాడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని సౌదీ హెచ్చరించినట్లు సమాచారం. ఇటు ఇరాన్ కూడా పాకిస్తాన్‌ను ఇప్పటికే హెచ్చరించింది. ఈ పరిస్థితి పాకిస్తాన్ పార్లమెంటులో కూడా చర్చకు వచ్చింది. ఒక ప్రతిపక్ష ఎంపీ మాట్లాడుతూ.. “మనం ఇరాన్‌కు ఫోన్ చేసి మేము మీతో ఉన్నామన్నాం, సౌదీకి ఫోన్ చేసి మేము మీతో ఉన్నామన్నాం. కానీ వారు ఇద్దరూ మాట్లాడుకుని మనల్ని సైలెంట్ గా ఉండమని చెప్పారు” అంటూ ఎద్దేవా చేశారు. గతేడాది కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీపై దాడి జరిగితే పాకిస్తాన్ స్పందించాల్సి ఉంటుంది.
భారత్ దౌత్య నీతి పాకిస్తాన్ ఇరు దేశాలతో దోబూచులాడుతుంటే, భారత్ మాత్రం ఇరాన్ మరియు సౌదీ అరేబియాతో చర్చలు జరుపుతోంది. ప్రధాని మోదీ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో మాట్లాడి భరోసా ఇచ్చారు. అదే సమయంలో, భారత్ ఇరాన్‌తో కూడా సంబంధాలను కొనసాగిస్తోంది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలియజేశారు. పాకిస్తాన్ రెండు దేశాలను మోసం చేస్తుంటే, భారత్ మాత్రం ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది.

Leave a Reply