న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న అలీషా బెయోత్రా అనే భారతీయ మహిళ, తాను మరియు తన భర్త అనుసరించే ఆర్థిక నియమాలను ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు. అధిక ఆదాయం ఉన్నప్పటికీ, వారు పాటించే క్రమశిక్షణ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఆమె పంచుకున్న ఆ 5 ముఖ్యమైన నియమాలు ఇవే:
- ‘పే యువర్ సెల్ఫ్ ఫస్ట్’ (ముందు మీకోసం దాచుకోండి)
చాలామంది ఖర్చులు పోగా మిగిలినది దాచుకుంటారు. కానీ అలీషా దంపతులు దీనికి భిన్నంగా చేస్తారు. జీతం పడగానే ముందుగా $3,500 నుండి $5,000 (సుమారు రూ. 3 లక్షల నుండి 4.2 లక్షలు) వరకు నేరుగా ఇన్వెస్ట్‌మెంట్ ఖాతాల్లోకి మళ్లించి, ఆ తర్వాతే మిగిలిన ఖర్చులను చూసుకుంటారు. - సమయం ముఖ్యం.. ఆడంబరం కాదు
“మేము సమయం కోసం ఖర్చు చేస్తాం కానీ, ఇతరులకు చూపించుకోవడానికి (Flex) కాదు” అని ఆమె పేర్కొన్నారు. తమ విలువైన సమయాన్ని ఆదా చేసే పనుల కోసం డబ్బు ఖర్చు చేయడానికి వారు వెనుకాడరు. కానీ, ఇతరులను ఆకట్టుకోవడానికి అనవసరమైన బ్రాండెడ్ వస్తువులపై ఖర్చు చేయరు. - అవసరమైన వస్తువుల కోసం భారీ ఖర్చు
రోజువారీ జీవితంలో ఉపయోగపడే నాణ్యమైన వస్తువుల కోసం వారు ఎంతైనా ఖర్చు చేస్తారు. ఉదాహరణకు, ఆఫీసులో రోజూ కూర్చునే సౌకర్యం కోసం సుమారు రూ. 1.2 లక్షల ($1,500) విలువైన ‘హెర్మన్ మిల్లర్’ చైర్‌ను కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. - క్రెడిట్ కార్డ్ పాయింట్ల వినియోగం
క్రెడిట్ కార్డ్ వాడటానికి వారు భయపడరు. ప్రతీ చిన్న వస్తువును కార్డ్ ద్వారానే కొనుగోలు చేస్తారు. దీనివల్ల వచ్చే రివార్డ్ పాయింట్లతో విమాన ప్రయాణాలు, హోటల్ స్టేలను ఉచితంగా పొందుతుంటామని ఆమె వివరించారు. - నిరంతర అభ్యాసం (Investing in an Edge)
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి వారు లక్షల్లో ఖర్చు చేస్తారు. ఆమె భర్తకు ఇప్పటికే MBA మరియు CFA డిగ్రీలు ఉన్నప్పటికీ, ఇన్వెస్టింగ్ కోర్సు కోసం రూ. 2.5 లక్షలకు పైగా ఖర్చు చేశారు. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Claude Code) వంటి టూల్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం కూడా వారు వెనుకాడరు.
నెటిజన్ల స్పందన
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “AI సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం నేను చేసిన బెస్ట్ డెసిషన్” అని ఒకరు అనగా, “విలాసాల కోసం ఖర్చు చేయలేనప్పుడు అంత డబ్బు సంపాదించి ఏం లాభం?” అని మరొకరు ప్రశ్నించారు.

Leave a Reply