వేసవి ఎండల నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది పుచ్చకాయను ఆశ్రయిస్తారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల దాహాన్ని, ఆకలిని తీర్చడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, సి, బి6 మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అయితే, పుచ్చకాయను తినేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
జాగ్రత్త పడాల్సిన విషయాలు:
కోసిన పుచ్చకాయ: పుచ్చకాయను కోసిన తర్వాత ఎక్కువ సేపు బయట ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అందులోకి బ్యాక్టీరియా చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఫ్రిజ్ లో నిల్వ: పుచ్చకాయను ఎక్కువ రోజులు ఫ్రిజ్లో నిల్వ ఉంచడం మంచిది కాదు.
అమితంగా తినడం: పుచ్చకాయను అతిగా తినడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
భోజనం తర్వాత: భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినకూడదు. భోజనానికి, పుచ్చకాయకు మధ్య కనీసం ఒక గంట విరామం ఉండాలి.
నీరు తాగడం: పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఇది జీర్ణక్రియను అడ్డుకుంటుంది మరియు కడుపులో అసౌకర్యానికి కారణమవుతుంది.
జీర్ణ సమస్యలు: పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి. తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణనాళంలోని సూక్ష్మజీవుల పనితీరు వేగవంతమై గ్యాస్, కడుపు ఉబ్బరం (Bloating) వంటి సమస్యలు వస్తాయి.
రాత్రి సమయాల్లో: రాత్రిపూట పుచ్చకాయ తినడం మానుకోవాలి.
మధుమేహం: డయాబెటిస్ (ప్రమేహం) ఉన్నవారు పుచ్చకాయను పరిమితంగా తీసుకోవాలి లేదా వైద్యుల సలహా పాటించాలి.
