ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం లేక ఈ ఉద్యోగి ఏం చేశాడో తెలుసా? ఆ తెలివికి మీరు కూడా ఫిదా అవుతారు!

మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకరు ‘ఎక్స్‌ట్రోవర్ట్’ (Extrovert) – వీరు అందరితో కలిసిపోతూ, కొత్త వారితో కూడా చాలా సరదాగా మాట్లాడేస్తుంటారు. రెండో రకం ‘ఇంట్రోవర్ట్’ – వీరు ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు, ఒంటరిగా లేదా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఇంట్రోవర్ట్ ఉద్యోగి ఆఫీసు సహోద్యోగుల నుండి తప్పించుకోవడానికి వాడిన వినూత్నమైన ఉపాయం చర్చనీయాంశంగా మారింది.

ఆ ఉద్యోగి చేసిన పని ఏంటి? వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ‘రెడ్డిట్’ (Reddit) నుండి వచ్చిన ఒక స్క్రీన్‌షాట్. అందులో ఒక వ్యక్తి తన సహోద్యోగి గురించి ఇలా రాశారు: “మా ఆఫీసులో 6 నెలల క్రితం ఒక వ్యక్తి చేరాడు. అతను జాయిన్ అయిన వారం రోజులకే నాకు మెసేజ్ చేసి కొంత డబ్బు అప్పుగా అడిగాడు. నాకు ఇది చాలా వింతగా అనిపించింది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, అతను ఆఫీసులోని చాలా మందిని అలాగే అప్పు అడిగాడు. దీనివల్ల అతనికి డబ్బుల పిచ్చి ఉందనో లేదా ఇబ్బందుల్లో ఉన్నాడనో భావించి మేమందరం అతనితో మాట్లాడటం మానేశాం, పార్టీలకు పిలవడం ఆపేశాం.”

అసలు నిజం తెలిసింది ఇలా: “ఈ రోజు నేను అతన్ని బయట ఒక ‘బైక్ క్లబ్’లో కలిశాను. అతని దగ్గర ఖరీదైన ‘హార్లే-డేవిడ్‌సన్’ బైక్ ఉంది. నేను ఆశ్చర్యపోయి.. ‘భయ్యా, ఇంత ఖరీదైన బైక్ కొనగల నీకు అప్పు అడగాల్సిన అవసరం ఏమొచ్చింది?’ అని అడిగాను. దానికి అతను నవ్వుతూ ఇచ్చిన సమాధానం నన్ను షాక్‌కు గురిచేసింది. తనకు నిజంగా డబ్బు అవసరం లేదని, తను ఒక ఇంట్రోవర్ట్ అని చెప్పాడు. అందరితో అనవసరమైన కబుర్లు చెప్పడం తనకు ఇష్టం ఉండదు. ఒకసారి అప్పు అడిగితే సహోద్యోగులే దూరంగా ఉంటారు కాబట్టి, ఆ ప్రశాంతత కోసమే తను అలా అప్పు అడిగినట్లు క్లారిటీ ఇచ్చాడు.”


Posted

in

by

Tags: