న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో జనరల్ కోచ్ అంటేనే రద్దీ, చెమట, సీట్ల కోసం పోట్లాటలు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం ఇవన్నీ మర్చిపోతారు. కిక్కిరిసిన భోగీలో ఒక మహిళకు, ఒక యువకుడికి మధ్య జరిగిన గొడవ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏం జరిగిందంటే?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక మహిళ చేతిలో చెప్పు పట్టుకుని ఒక యువకుడిని తీవ్రంగా అవమానిస్తోంది. ఆమె గట్టిగా అరుస్తూ.. “నా కొడుకు ఇంజనీర్, మా ఆయన సూపర్వైజర్.. నీ హోదా ఏంటి?” అంటూ ఆ యువకుడిపై విరుచుకుపడింది. అప్పటివరకు ఆ యువకుడు చాలా ఓపికగా ఉంటూ, తన చుట్టూ ఉన్న ప్రయాణికులకు ఆమె ప్రవర్తనను చూపిస్తూ మౌనంగా ఉన్నాడు.
భార్యపై కామెంట్ చేయడంతో సీన్ రివర్స్
యువకుడు ఎంత శాంతంగా ఉన్నా ఆ మహిళ మాత్రం తగ్గలేదు. యువకుడిని వదిలేసి, అతని పక్కనే ఉన్న భార్యను బూతులు తిడుతూ, ఆమె అందంపై అసభ్యకరమైన కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది. తన భార్యను అవమానించడం చూసి ఆ యువకుడు సహనం కోల్పోయాడు.
ఆవేశంలో ఊగిపోయిన యువకుడు, ఆ మహిళపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఏమాత్రం ఆలోచించకుండా వరుసగా చెంపదెబ్బలు కొట్టాడు. కోచ్‌లోని తోటి ప్రయాణికులు అతడిని ఆపేందుకు ప్రయత్నించినా, ఆవేశం తగ్గని యువకుడు ఆమెను చితకబాదాడు.
నెటిజన్ల మధ్య యుద్ధం: తప్పు ఎవరిది?
ఈ వీడియో సోషల్ మీడియాలో (X/Twitter) వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఒక వర్గం: “ఎవరైనా తన భార్యను తిడితే భర్త ఎలా సహిస్తాడు? ఆ మహిళకు తగిన శాస్తి జరిగింది, నోరు అదుపులో పెట్టుకోవాలి” అని యువకుడికి మద్దతు ఇస్తున్నారు.
మరో వర్గం: “ఆమె తప్పు చేసినా, ఒక మహిళపై చేయి చేసుకోవడం పద్ధతి కాదు. యువకుడు పోలీసులకో లేదా TTEకో ఫిర్యాదు చేయాల్సింది” అని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో రైల్వే ప్రయాణికుల్లో మరియు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
