సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన సరదా వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు.
తాజాగా ఒక ముద్దుల చిలుక తన యజమానురాలిని టమాటా అడిగిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. యజమానురాలు టమాటా ఇవ్వనని చెప్పగానే, ఆ చిలుక కోపంతో ఏకంగా పోలీసులను పిలుస్తానంటూ బెదిరించడం!
వైరల్ వీడియోలో ఏముంది?
వీడియోలో ఒక చిలుక తన యజమానురాలిని టమాటా కావాలని పదేపదే అడుగుతుంటుంది. ఆ చిలుక చాలా ముద్దుగా మాట్లాడుతూ టమాటా అడగడం చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అయితే, ఆ మహిళ కావాలనే టమాటా ఇవ్వనని చెప్పడంతో, ఆ చిలుక వెంటనే అలక పూనింది. అంతటితో ఆగకుండా “పోలీస్… పోలీస్…” అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. టమాటా ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నట్లుగా ఆ చిలుక చేసిన పనికి యజమానురాలు నవ్వు ఆపుకోలేకపోయింది.
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్:
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
- “ఈ చిలుక చాలా తెలివైంది, పోలీసులను పిలిస్తే టమాటా దొరుకుతుందని దానికి తెలుసు” అని ఒకరు కామెంట్ చేయగా..
- “ఇకపై టమాటా ఇవ్వకపోవడం కూడా నేరమే అన్నమాట” అని మరొకరు జోక్ చేశారు. చిలుక తెలివితేటలను, అది మాట్లాడే విధానాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ చిలుక క్యూట్నెస్కు ముగ్ధులవుతున్నారు.
