ప్రశ్న: కొన్ని రాత్రుల క్రితం నా భార్య నేను మంచం మీద ఉన్నప్పుడు ఒక విచారకరమైన సంఘటన జరిగింది. మేమిద్దరం శృంగారంలో ఉండగా, ఆమె అకస్మాత్తుగా ఒక వింత శబ్దం చేయడం విన్నాను. మొదట నేను దాన్ని పట్టించుకోలేదు, కానీ కాసేపటికి అది ఏంటో నాకు అర్థమైంది.
ఆమె గురక పెడుతోంది! మేము శృంగారంలో ఉండగానే ఆమె నిద్రపోయింది. నేను ఆమెను లేపి ఏం జరిగిందో చెప్పాను. ఆమె క్షమాపణ కోరుతూ, తను బాగా అలసిపోయి ఉన్నానని చెప్పింది. కానీ అప్పటికే నా మూడ్ మొత్తం పాడైపోయింది. నా భార్యను నేను సంతృప్తి పరచలేకపోతున్నాననే భావన నాలో పెరిగిపోయింది. నా పర్ఫార్మెన్స్ ఆమెకు బోర్ కొట్టడం వల్లే ఆమె నిద్రపోయిందని నేను భావిస్తున్నాను. నేను దీని నుండి ఎలా బయటపడాలి?
నిపుణుల సలహా :
మీ భార్య మాటను నమ్మండి. సెక్స్ అనేది గొర్రెలను లెక్కపెట్టినంత బోరింగ్‌గా ఉంటే, అప్పుడు మీ పర్ఫార్మెన్స్లో సమస్య ఉందని అనుకోవచ్చు. కానీ ఇది ఒకేసారి జరిగిన సంఘటన అయితే, దాన్ని ఒక చిన్న పొరపాటుగా భావించి వదిలేయండి.
- అలసట సహజం: మనుషులు అలసిపోవడం సహజం. పిల్లల పెంపకం, ఆఫీస్ పని, ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఆమె బాగా అలసిపోయి ఉండవచ్చు.
- పెళ్లయిన జంటల్లో: వివాహ బంధంలో ఉన్నప్పుడు శృంగారం అనేది ప్రతిసారీ ఒకేలా ఉత్సాహంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆమెను క్షమించి ఒక అవకాశం ఇవ్వండి.
- కమ్యూనికేషన్: మీ ఇగో దెబ్బతిన్న మాట వాస్తవమే, కానీ దీని గురించి ఆమెతో ప్రశాంతంగా మాట్లాడండి. సమస్య మీ పర్ఫార్మెన్స్ వల్ల కాదని ఆమె మీకు భరోసా ఇస్తే, ఆ విషయాన్ని నమ్మి ముందుకు సాగండి. ఒకవేళ నిజంగానే మీ పర్ఫార్మెన్స్లో మార్పులు కోరుకుంటే, అది కూడా చర్చించుకోవడానికి ఇది మంచి అవకాశం.
తదుపరిసారి మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆమె నిద్రపోకుండా ఉంటే, మీ పర్ఫార్మెన్స్లో లోపం లేదని మీకు మీరే నిరూపించుకున్నట్లు అవుతుంది. ఆ ఒక్క సంఘటనను పీడకలలా మర్చిపోండి.
