కేరళ ఒపీనియన్ పోల్: ఈసారి కేరళలో ఎవరి ప్రభుత్వం? ఎన్డీయే పరిస్థితి ఏంటి?

కేరళతో సహా నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మోగింది. ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు తక్షణమే ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ (Model Code of Conduct) అమలులోకి వచ్చింది.

కేరళలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 140 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో MATRIZE-IANS ఒపీనియన్ పోల్ ప్రకారం.. అధికార కూటమి అయిన వామపక్ష డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం LDF మరోసారి మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది.

మెజారిటీ మార్కు 71 సీట్లు కాగా, సర్వే అంచనాలు ఇలా ఉన్నాయి:

  • LDF (వామపక్ష కూటమి): 61-71 సీట్లు
  • UDF (కాంగ్రెస్ కూటమి): 58-69 సీట్లు
  • BJP/NDA: 2 సీట్లు
  • ఇతరులు: 0 సీట్లు

ఓట్ల శాతం పరంగా LDF కి 42-43%, UDF కి 41-42%, బిజెపికి 12-13% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మలబార్ ప్రాంతంలో ఎల్డీఎఫ్ కి 22-26 సీట్లు, సెంట్రల్ కేరళలో యూడీఎఫ్ కి 21-26 సీట్లు రావచ్చని అంచనా.

ఎన్నికల కీలక తేదీలు:

  • ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 16
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 23
  • నామినేషన్ల పరిశీలన: మార్చి 24
  • ఉపసంహరణకు గడువు: మార్చి 26
  • పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9
  • ఫలితాల వెల్లడి: మే 4

ఓటర్ల వివరాలు: కేరళలో మొత్తం 2.71 కోట్లకు పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 14 స్థానాలు ఎస్సీ (SC)లకు, 2 స్థానాలు ఎస్టీ (ST)లకు రిజర్వ్ చేయబడ్డాయి. విశేషమేమిటంటే, ఈసారి 273 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 4.24 లక్షల మంది యువ ఓటర్లు (18-19 ఏళ్లు) మొదటిసారి ఓటు వేయబోతున్నారు. 85 ఏళ్లు పైబడిన వయోవృద్ధుల కోసం ఎన్నికల సంఘం ‘హోమ్ ఓటింగ్’ (పోస్టల్ బ్యాలెట్) సౌకర్యాన్ని కల్పించింది.


Posted

in

by

Tags: