డొనాల్డ్ ట్రంప్: ‘వీరంతా పిరికివారు, వీరిని గుర్తుంచుకుంటాం’; పెరుగుతున్న చమురు ధరలపై నాటో దేశాలపై ట్రంప్ ఆగ్రహం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నాటో (NATO) దేశాలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) ద్వారా నౌకల రాకపోకలను సురక్షితం చేయడంలో ఈ దేశాలు అమెరికాకు సహాయం చేయడం లేదని, కానీ చమురు ధరలు పెరిగాయని మాత్రం ఫిర్యాదు చేస్తున్నాయని ట్రంప్ విమర్శించారు.

“వీరంతా పిరికివారు, వీరిని మేము గుర్తుంచుకుంటాం” అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రూత్ సోషల్ (Truth Social) వేదికగా స్పందిస్తూ.. “అమెరికా లేకపోతే నాటో ఒక కాగితపు పులి! అణుశక్తి కలిగిన ఇరాన్‌ను అడ్డుకునే పోరాటంలో వారు చేరాలని అనుకోవడం లేదు” అని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికాకు నాటో మద్దతు లేదు: ట్రంప్ ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల మద్దతును ట్రంప్ కోరగా, అనేక దేశాలు నిరాకరించాయి. ఇరాన్‌పై అమెరికా ఒంటరిగా పోరాడుతోందని, నాటో సభ్య దేశాలు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.

“సైనికంగా ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత, ముప్పు తగ్గాక వారు చమురు ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ హోర్ముజ్ జలసంధిని తెరిపించడంలో మాత్రం సహాయం చేయడం లేదు. చమురు ధరలు పెరగడానికి ఇదే ప్రధాన కారణం” అని ఆయన అన్నారు. నాటో దేశాల నేతలను భయస్థులుగా అభివర్ణిస్తూ, ఈ విషయాన్ని తాము గుర్తుంచుకుంటామని హెచ్చరించారు.

ఇరాన్ యుద్ధంతో ప్రపంచ చమురు సంక్షోభం: ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు చేయడంతో ఉత్పత్తి మందగించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో చమురు సంక్షేమం ఏర్పడింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను తప్ప మిగిలిన వాటిని అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. ట్రంప్ విజ్ఞప్తి చేసినప్పటికీ బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇది అమెరికా యుద్ధమే కానీ నాటోది కాదని, తాము సైన్యాన్ని పంపబోమని స్పష్టం చేశాయి.


Posted

in

by

Tags: