చీకట్లోకి ఇరాన్.. హార్ముజ్ జలసంధిపై 48 గంటల గడువుతో ట్రంప్ హెచ్చరిక! షాకింగ్ ప్రకటన

వాషింగ్టన్: ఇరాన్ ఎటువంటి బెదిరింపులు లేకుండా హార్ముజ్ జలసంధిని తదుపరి 48 గంటల్లో తెరవాలి. లేనిపక్షంలో ఆ దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడి చేస్తుంది. మొదట పెద్ద విద్యుత్ కేంద్రాల నుండే ఈ దాడులు ప్రారంభమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా హెచ్చరించారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హార్ముజ్ జలసంధిని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇరాన్ తెరవాలని, లేదంటే సరిగ్గా 48 గంటల్లో ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ఖాతాలో ఇలా పేర్కొన్నారు: “ఎటువంటి బెదిరింపులు లేకుండా ఇరాన్ తన హార్ముజ్ జలసంధిని తెరవాలి. ఇది చేయకపోతే, సరిగ్గా 48 గంటల్లో అమెరికా ఇరాన్ యొక్క వివిధ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. ముఖ్యంగా అతిపెద్ద విద్యుత్ కేంద్రం నుండి ఈ దాడి మొదలవుతుంది. మీ దృష్టికి ధన్యవాదాలు.”

మరో పోస్ట్‌లో ట్రంప్ ఇలా అన్నారు: “అమెరికా ఇరాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా తుడిచిపెట్టేసింది. అయినప్పటికీ వారి అసమర్థ విశ్లేషకుడు డేవిడ్ సాంగర్, నేను నా లక్ష్యాలను చేరుకోలేదని అంటున్నారు. నిజానికి నేను నా లక్ష్యాలను అనుకున్న సమయం కంటే కొన్ని వారాల ముందే చేరుకున్నాను. వారి నాయకత్వం అంతమైంది. వారి నౌకాదళం, వాయుసేన నిష్క్రియమయ్యాయి. వారి వద్ద ఎటువంటి రక్షణ లేదు. ఇప్పుడు వారు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నారు, కానీ నాకు అది ఇష్టం లేదు.”


Posted

in

by

Tags: