బెంగళూరు: దిల్లీలోని గురుగ్రామ్‌కు చెందిన ఒక ఇంజనీర్, బెంగళూరుకు మారడం తన వల్ల కాదంటూ ఏకంగా రూ. 34 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. గౌరవ్ శరణ్ అనే వ్యక్తి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
“ఇటీవల నాకు బెంగళూరులో రూ. 35 లక్షల ప్యాకేజీతో ఒక ఉద్యోగ ఆఫర్ వచ్చింది. కంపెనీ మరియు ప్యాకేజీ రెండూ బాగున్నాయి. కానీ వారు బెంగళూరుకు వచ్చి పనిచేయాలని (Relocation) కండిషన్ పెట్టారు. అయితే ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించాను. ఎందుకంటే నాకు ఎప్పటికీ బెంగళూరుకు వెళ్లడం ఇష్టం లేదు” అని ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో భిన్న స్పందనలు: శరణ్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు వాసులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- స్నేహ జైన్: “చాలా మంచి నిర్ణయం. జీవితంలో ఎప్పుడూ బెంగళూరుకు రాకండి” అంటూ ఎద్దేవా చేశారు.
- బాలాజీ: “నేను ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తాను. గురుగ్రామ్, హర్యానా, నోయిడా నుండి వచ్చే ప్రాజెక్టులను నేను ఎప్పుడూ ఒప్పుకోను. ఎందుకంటే వారు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించరు. కానీ పుణె, బెంగళూరు, ముంబై, చెన్నైలలో అటువంటి పరిస్థితి లేదు” అని కౌంటర్ ఇచ్చారు.
- మొహమ్మద్ జుబేర్: “మంచి నిర్ణయం. బెంగళూరు వాసులు మీకు రుణపడి ఉంటారు (నగరంలో రద్దీ తగ్గుతుందనే అర్థంలో)” అని వ్యాఖ్యానించారు.
