ఈ చోట ముద్దు ఇచ్చే ముందు జాగ్రత్త! ప్రియురాలు ఇచ్చిన ముద్దుతో రక్తం గడ్డకట్టి యువకుడు మృతి – అసలేం జరిగింది?

యువతీ యువకుల్లో ఉత్సాహం మితిమీరినప్పుడు అది ప్రాణాంతకంగా కూడా మారవచ్చని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మెక్సికో సిటీలో ఒక యువకుడు తన ప్రియురాలి నుండి పొందిన గాఢమైన ముద్దు (Kiss) కారణంగా రక్తం గడ్డకట్టి, పక్షవాతం (Stroke) రావడంతో మరణించాడు.

కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతి ఇచ్చిన ‘లవ్ బైట్’ కారణంగానే రక్తం గడ్డకట్టి అతనికి ఈ గతి పట్టిందని వైద్యులు తెలిపారు. జూలియో మాసియాస్ గొంజాలెజ్ అనే యువకుడికి ప్రియురాలు ఇచ్చిన ముద్దు శాపమైంది. గడ్డకట్టిన రక్తం మెదడుకు ప్రయాణించి పక్షవాతానికి దారితీసిందని మెక్సికన్ మీడియా నివేదించింది. తన 24 ఏళ్ల ప్రియురాలితో గడిపి వచ్చిన తర్వాత, 17 ఏళ్ల ఆ యువకుడు తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు.

ఏం జరిగింది? తనకంటే వయసులో చిన్నవాడైన ఆ యువకుడి మెడ భాగంలో ప్రియురాలు గాఢంగా ముద్దు పెట్టింది. ఆ సమయంలో మెడపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల అక్కడి రక్తనాళం (Artery) దెబ్బతిన్నది. దీనివల్ల ఏర్పడిన రక్తం గడ్డ (Blood Clot) మెదడుకు చేరుకుని, రక్త ప్రసరణను నిలిపివేసిందని వైద్యులు వివరించారు.

అపాయకరమైన ప్రదేశం: మెడకు ఇరువైపులా ‘కెరోటిడ్ ధమని’ (Carotid Artery) ఉంటుంది. కాబట్టి ఈ భాగంలో తీవ్రంగా ముద్దు పెట్టుకోవడం ప్రమాదకరమని వైద్యుల సలహా. 2010లో కూడా 44 ఏళ్ల మహిళకు ఇలాంటి ముద్దు వల్లే పక్షవాతం రాగా, ఆమె తర్వాత కోలుకున్నారు. సాధారణంగా రక్తం గడ్డకట్టడం ప్రమాదకరం కానప్పటికీ, ఆ గడ్డ రక్తనాళాల ద్వారా గుండె లేదా ఊపిరితిత్తులకు, మెదడుకు ప్రయాణిస్తే రక్త ప్రసరణ ఆగిపోయి ప్రాణాపాయం సంభవిస్తుంది.


Posted

in

by

Tags: