బంగారు నాణెంతో ట్రంప్ తన మార్క్ చూపించారు! అమెరికాలో గోల్డ్ కాయిన్ సృష్టించిన సంచలనం

న్యూయార్క్: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరూ ఊహించని మార్పును తెరపైకి తెచ్చారు. శతాబ్ద కాలంగా వస్తున్న సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమెరికాలో పెను చర్చకు దారితీసింది. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా, ట్రంప్ చేసే పనులు వివాదాలకు కేంద్రబిందువు అవుతాయనడానికి ఇదొక తాజా ఉదాహరణ.

అమెరికా చరిత్రలో జూలై 4, 2026 అత్యంత కీలకమైన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక బంగారు నాణేన్ని రూపొందించారు.

సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ట్రంప్: సాధారణంగా అమెరికాలో జీవించి ఉన్న అధ్యక్షుల రూపాలను నాణేలు లేదా నోట్లపై ముద్రించరు. కానీ ట్రంప్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, తన ముఖచిత్రంతో కూడిన బంగారు నాణేన్ని స్వయంగా పరిచయం చేశారు. ఈ నాణేనికి ఒకవైపు ట్రంప్ తన చేతులను టేబుల్‌పై ఉంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో నిలబడినట్లు ఉండగా, మరోవైపు అమెరికా గంభీరమైన గద్ద (Eagle) చిహ్నాన్ని రూపొందించారు.

ఇది చలామణి కోసం కాదు: ప్రభుత్వ వర్గాల వివరణ ప్రకారం.. ఇది కేవలం నాణేలను సేకరించే వారి కోసం (Collectors) రూపొందించిన ఒక ‘జ్ఞాపిక’ మాత్రమే. ఇది మార్కెట్‌లో డబ్బుగా చలామణి అవ్వదు. అయినప్పటికీ, దీనిపై అమెరికాలో న్యాయపరమైన వాదనలు మొదలయ్యాయి. 1776 నుండి 2026 వరకు ఉన్న కాలాన్ని సూచిస్తూ, నాణెంపై ‘LIBERTY’ (స్వేచ్ఛ) అనే పదాన్ని ముద్రించారు. 1926 తర్వాత ఇలాంటి గౌరవం పొందిన అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.

అమెరికాలో రాజకీయ యుద్ధం: ట్రంప్ చర్యను ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు తమను తాము ఇలా ప్రదర్శించుకోవడం రాచరిక వ్యవస్థను తలపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. కేవలం రాజులు, నియంతలు మాత్రమే తమ బొమ్మలను నాణేలపై వేయించుకుంటారని, ప్రజాస్వామ్య నేతలు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని వారు వాదిస్తున్నారు.

అయితే, ట్రెజరీ సెక్రటరీకి ఇటువంటి జ్ఞాపిక నాణేలను విడుదల చేసే అధికారం చట్టపరంగా ఉందని ప్రభుత్వ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ బంగారు నాణేలను పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేసి విక్రయానికి తీసుకురానున్నారు. అమెరికా పావు శతాబ్దపు స్వాతంత్ర్య చరిత్రలో, ఒక వివాదాస్పద అధ్యక్షుడి ముఖచిత్రంతో కూడిన ఈ నాణెం చారిత్రాత్మక ప్రాముఖ్యతను సంతృించుకుంది.


Posted

in

by

Tags: