ప్రపంచానికే ముప్పు.. ఇరాన్ యుద్ధం వాయిదా.. రష్యాను దెబ్బకొట్టిన ఉక్రెయిన్! ప్రపంచంలోని రెండు ప్రధాన చమురు మార్గాలు మూసివేత.. భారత్‌కు పెను షాక్!

ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్ యుద్ధంపై ఉన్న తరుణంలో, ఉక్రెయిన్ అనూహ్యంగా రష్యాలోని అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రమైన ‘ప్రిమోర్స్క్’ (Primorsk) పై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది.

బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న ఈ కీలక కేంద్రంపై ఉక్రెయిన్ సుమారు 249 డ్రోన్లను ఉపయోగించి దాడి చేయడంతో, అక్కడ ఉన్న చమురు నిల్వ కేంద్రాలు భారీ మంటల్లో చిక్కుకున్నాయి.

భారత్‌కు ఎందుకు ఆందోళన? ప్రతిరోజూ 15 లక్షల బారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసే ఈ కేంద్రం ప్రస్తుతం తాత్కాలికంగా మూతపడింది. రష్యా నుండి సూయజ్ కాల్వ మీదుగా భారత్‌కు వచ్చే ముడి చమురుకు ఇది ప్రధాన ఆధారం. రష్యా చమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న భారత్‌కు ఈ సరఫరా నిలిచిపోవడం ఆందోళన కలిగించే అంశం.

ఒకేసారి రెండు మార్గాల మూసివేత: ఇప్పటికే ఇరాన్ ‘హోర్ముజ్’ (Hormuz) జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. ఇప్పుడు రష్యాలోని ఈ చమురు కేంద్రం కూడా దెబ్బతినడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఇంధన సంక్షేమం ఏర్పడే ప్రమాదం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో జరిగిన ఈ దాడి వల్ల ముడి చమురు ధరలు మార్కెట్‌లో మరింతగా పెరిగే అవకాశం ఉంది.

సౌదీ అరేబియా వంటి దేశాలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నప్పటికీ, ప్రపంచంలోని రెండు అతిముఖ్యమైన చమురు సరఫరా మార్గాలు ఒకే సమయంలో మూతపడటం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది.


Posted

in

by

Tags: