20 లేదా 30 ఏళ్లలో ఉన్న ఎవరికైనా తల్లిదండ్రులు, బంధువుల నుండి వచ్చే పెళ్లి ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఆ ఒత్తిడికి ‘ఆత్మలు, దయ్యాల’ మలుపు తోడైతే ఎలా ఉంటుంది?
కోల్‌కతాకు చెందిన ఒక మహిళకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన తల్లి తనను పెళ్లికి ఒప్పించడానికి చేస్తున్న వింత ప్రయత్నాన్ని ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంది.
వైరల్ అవుతున్న ఆ క్లిప్‌లో, 31 ఏళ్ల కూతురు వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆ బెంగాలీ తల్లి ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే, సాధారణంగా చెప్పే “లైఫ్‌లో సెటిల్ అవ్వు” అనే ఉపన్యాసం కాకుండా.. ఒకవేళ కూతురు పెళ్లి చేసుకోకపోతే, చనిపోయిన తర్వాత ఆమె తండ్రి ఒక “అసహాయ ఆత్మ” (Helpless Spirit) గా మారిపోతాడని, పరలోకంలో ఆయనకు ప్రశాంతత ఉండదని హెచ్చరించింది. అవును, మీరు చదివింది నిజమే!
అల్ట్రా ప్రో మాక్స్ మానిప్యులేషన్: ఆ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోపై “31 ఏళ్ల కూతురిని పెళ్లికి ఒప్పిస్తున్న బెంగాలీ మామ్: నువ్వు పెళ్లి చేసుకోకపోతే మీ నాన్న ఆత్మగా మారి ఇబ్బంది పడతాడు. అల్ట్రా ప్రో మాక్స్ మానిప్యులేషన్” అని రాసి ఉంది. దీనికి “నన్ను ఒప్పించడానికి మా అమ్మ పిచ్చి పరాకాష్టకు చేరింది” అనే క్యాప్షన్ ఇచ్చింది.
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్: ఈ వీడియో దాదాపు లక్షకు పైగా వ్యూస్ సాధించింది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు:
- “నాకు 29 ఏళ్లు. మా అమ్మ కూడా ఇలాగే అంటుంది. అంతా నాన్న గురించే చెబుతుంది, కానీ పాపం మా నాన్నకు ఈ విషయాలేవీ తెలియవు!” అని ఒకరు రాశారు.
- “పెళ్లి చేసుకో నీ అకౌంట్లో ₹10 లక్షలు వేస్తానని మా నాన్న చెప్పారు.. పెళ్లి అయిపోయింది కానీ ఆ డబ్బులు మాత్రం రాలేదు” అని మరొకరు జోక్ చేశారు.
- “యూట్యూబ్ జ్యోతిష్యులను ఎవరైనా ఆపండి, వారు చెప్పేవి విని అమాయకపు తల్లులు ఇలా మారిపోతున్నారు” అని ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు.
