మీ ఇంటి మిద్దె ఖాళీగా ఉందా? ఆ ఖాళీ స్థలమే మీ ఆదాయాన్ని మార్చే రహస్యం కావచ్చు. పెద్దగా పెట్టుబడి లేకుండానే, ఇంటి నుండే లక్షలు సంపాదించే ఒక మార్గం ఉంది.
వ్యాపారం చేయాలంటే భారీ పెట్టుబడి ఉండాలని, బయటకు వెళ్లి పని చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ, సరైన ఆలోచన ఉంటే ఇంటి నుండే మంచి ఆదాయం పొందవచ్చు. దానికి ఒక ఆసక్తికరమైన మార్గమే మిద్దె (Terrace) స్థలాన్ని ఉపయోగించి చేపల పెంపకం చేపట్టడం. చాలా ఇళ్లలో మిద్దె భాగం ఖాళీగానే ఉంటుంది. కొందరు కేవలం మొక్కలు పెంచడానికే దీనిని ఉపయోగిస్తారు.
అయితే అదే స్థలాన్ని చిన్న తరహా పరిశ్రమగా మార్చితే అదనపు ఆదాయం గడించవచ్చు. నగరాల్లో స్థలం తక్కువగా ఉన్న నేపథ్యంలో, మిద్దెపై చేపల పెంపకం (Terrace Fish Farming) ఇప్పుడు ఒక మంచి ప్రత్యామ్నాయ అవకాశంగా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం సులభం. మిద్దెపై ఫైబర్ లేదా సిమెంట్ ట్యాంకులను ఏర్పాటు చేసి, అందులో శుభ్రమైన నీటిని నింపాలి.
ఆ తర్వాత చేప పిల్లలను వదలవచ్చు. ప్రతిరోజూ కొద్దిగా మేత వేస్తూ, నీటి నాణ్యతను కాపాడితే సరిపోతుంది. తక్కువ స్థలం ఉన్నా 4 నుండి 5 ట్యాంకులతో ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంలో కొర్రమీను (Murrel) పెంపకం అధిక లాభాలను ఇస్తుంది. ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఒక కిలో కొర్రమీను ధర రూ. 400 వరకు పలుకుతోంది. హోటళ్లు, మార్కెట్లు మరియు శుభకార్యాల్లో ఈ చేపకు అధిక గిరాకీ ఉంటుంది.
ప్రారంభ పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. సుమారు రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కొన్ని బ్యాంకులు ఈ రంగానికి రుణాలను కూడా అందిస్తున్నాయి. సరైన ప్రణాళికతో చేస్తే, ప్రతి 6 నెలలకు ఒకసారి మంచి దిగుబడి వస్తుంది. ఒక సీజన్లో మంచి ఆదాయం లభిస్తే, నెలకు లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇంటి నుండే ఆదాయం పొందడానికి ఇది ఒక ఉత్తమ అవకాశం.
