డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో 2026: ముఖ్యమైన 10 వాగ్దానాలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వచ్చే ఎన్నికల కోసం 164 స్థానాల్లో డీఎంకే నేరుగా పోటీ చేస్తుందని ప్రకటిస్తూ, ప్రజలను ఆకట్టుకునేలా భారీ హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిని ‘ఎన్నికల కథానాయకుడు’గా అభివర్ణిస్తున్నారు.

ప్రధాన వాగ్దానాలు:
  1. మహిళా సాధికారత: ‘మహిళా గౌరవ వేతనం’ (Magalir Urimai Thogai) నెలకు ₹1000 నుండి ₹2000 కి పెంపు.
  2. ఇల్లాలి కూపన్ (Illatharasi Coupon): ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాల మహిళలకు వాషింగ్ మెషీన్, టీవీ, ఫ్రిజ్, మిక్సీ వంటి గృహోపకరణాలు కొనడానికి లేదా పాతవి మార్చుకోవడానికి ₹8 విలువైన ప్రత్యేక కూపన్లు.
  3. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు: ఉన్నత విద్య చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థులకు ఐదేళ్లలో ల్యాప్‌టాప్‌ల పంపిణీ.
  4. ఉచిత విద్యుత్: 20 లక్షల మంది రైతులకు ఎటువంటి మీటర్లు లేని ఉచిత పంప్‌సెట్ల పంపిణీ.
  5. వైద్యం: ముఖ్యమంత్రి బీమా పథకం పరిమితిని ₹10 లక్షలకు పెంపు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ యంత్రాల సంఖ్య రెట్టింపు.
  6. ఉద్యోగ అవకాశాలు: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.5 లక్షల పోస్టుల భర్తీ. 2030 నాటికి ప్రతి జిల్లాలో ‘నియో టైడల్ పార్కులు’ ఏర్పాటు ద్వారా 2 లక్షల కొత్త ఉద్యోగాలు.
  7. రైతులకు గిట్టుబాటు ధర: క్వింటాల్ వరికి ₹3,500, టన్ను చెరకుకు ₹4,500 చెల్లింపు.
  8. నివాసం: రాబోయే ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం.
  9. పెన్షన్ పెంపు: వృద్ధాప్య పింఛను ₹1200 నుండి ₹2000 కి, దివ్యాంగుల పింఛను ₹1500 నుండి ₹2500 కి పెంపు.
  10. బస్సుల సౌకర్యం: వచ్చే ఐదేళ్లలో 10,000 కొత్త బస్సుల ప్రారంభం.

Posted

in

by

Tags: