విశ్వాసానికి విజయ్ ఇచ్చిన కానుక – 30 ఏళ్లుగా తన కార్ డ్రైవర్‌గా ఉన్న రాజేంద్రన్ కుమారుడికి ఎమ్మెల్యే సీటు!

విరుగంబాక్కం నియోజకవర్గపు తమిళ వెట్రి కజగం (TVK) అభ్యర్థిగా శబరీనాథన్ పేరు ఖరారైంది.

శబరీనాథన్ తండ్రి రాజేంద్రన్, గత 30 ఏళ్లకు పైగా విజయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. రాజేంద్రన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ, విజయ్ ఆయన కుమారుడు శబరీనాథన్‌కు పోటీ చేసే అవకాశం కల్పించారు. తన తండ్రితో కలిసి వేదికపైకి వెళ్లి విజయ్‌ను కలిసిన సమయంలో, అభ్యర్థి శబరీనాథన్ ఆయన కాళ్లకు మొక్కి భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే రాజేంద్రన్ ఉండటం మనం చూడవచ్చు. విజయ్ తన అత్యంత సన్నిహిత వర్గంలో (Inner Circle) చాలా తక్కువ మందికి మాత్రమే చోటు ఇస్తారని, అందులో రాజేంద్రన్ అత్యంత ముఖ్యుడని విజయ్ సన్నిహితులు చెబుతుంటారు.


Posted

in

by

Tags: