UPI పేమెంట్ యాప్స్‌లో భారీ మార్పు: మీరు కూడా టీ కొట్టు నుండి షాపింగ్ మాల్ వరకు ప్రతిచోటా PhonePe, Google Pay లేదా Paytm వంటి UPI యాప్‌లను వాడుతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.
ఏప్రిల్ 1, 2026 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ చెల్లింపుల నిబంధనలలో ఒక కీలక మార్పును అమలు చేసింది. ఈ మార్పు మీ రోజువారీ లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మీ డబ్బు మునుపటి కంటే సురక్షితంగా ఉంటుంది, అయితే పేమెంట్ పూర్తి కావడానికి కొన్ని సెకన్ల సమయం అదనంగా పట్టవచ్చు.
పేమెంట్ కొత్త నిబంధన ఏమిటి?
ఇప్పటివరకు మీరు క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి, మీ 4 లేదా 6 అంకెల UPI పిన్ (PIN) ఎంటర్ చేయగానే పేమెంట్ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు భద్రతను పెంచుతూ RBI ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ (Two-Factor Authentication) అంటే ‘రెండంచెల భద్రత’ను తప్పనిసరి చేసింది. అంటే ఇకపై కేవలం పిన్ నంబర్ మాత్రమే సరిపోదు, దానితో పాటు మరొక భద్రతా దశను దాటాల్సి ఉంటుంది.
ఈ రెండో దశ మీ ఫోన్‌కు వచ్చే OTP కావచ్చు లేదా మీ ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడి (Face ID) కావచ్చు. ఈ రెండు దశలు పూర్తయితేనే మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది.
సామాన్యుల జీవితంపై దీని ప్రభావం ఏమిటి?
ఈ కొత్త నిబంధన వల్ల ఆన్లైన్ మోసాలు మరియు స్కామ్‌లకు చాలా వరకు అడ్డుకట్ట పడుతుంది. ఒకవేళ ఎవరికైనా మీ UPI పిన్ తెలిసినా, మీ ఫింగర్‌ప్రింట్ లేదా OTP లేకుండా వారు మీ ఖాతా నుండి ఒక్క రూపాయి కూడా తీయలేరు. మీరు ₹20 టీ తాగినా లేదా వేల రూపాయల బిల్లు కట్టినా.. ప్రతిసారీ ఈ రెండు దశల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కొంచెం సమయం పట్టినా, మీ కష్టార్జితం మాత్రం భద్రంగా ఉంటుంది.
లావాదేవీల పరిమితి (Limits) లో మార్పు లేదు
మంచి విషయం ఏమిటంటే, డబ్బు పంపే పరిమితిలో పెద్దగా మార్పులు లేవు:
- సాధారణ లావాదేవీలు: రోజుకు ₹1 లక్ష వరకు పంపవచ్చు.
- ఆసుపత్రి బిల్లులు, విద్యా ఫీజులు: రోజుకు ₹5 లక్షల వరకు పంపవచ్చు.
- కొత్త యూజర్లు: మొదటిసారి UPI వాడుతున్న వారు తొలి 24 గంటల్లో కేవలం ₹5,000 వరకు మాత్రమే లావాదేవీలు చేయగలరు.
ఏటీఎం నుండి నగదు విత్‌డ్రాపై కొత్త రూల్
ఇప్పుడు చాలామంది ఏటీఎం కార్డు లేకుండానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు విత్‌డ్రా చేస్తున్నారు. HDFC వంటి బ్యాంకులు ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మీ ‘ఫ్రీ లిమిట్’ (Free Limit) లో చేర్చాయి. అంటే నెలకు మీరు 5 సార్లు ఉచితంగా నగదు తీసుకునే పరిమితి దాటితే, కార్డుతో తీసినా లేదా UPI స్కాన్ చేసి తీసినా అదనపు చార్జీలు వర్తిస్తాయి.
మీరు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు
- మీ ఫోన్లోని అన్ని UPI యాప్‌లను అప్డేట్ చేసుకోండి.
- ఫోన్ సెట్టింగ్స్‌లో ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ లాక్ ఆన్ చేసుకోండి. దీనివల్ల OTP కోసం ఎదురుచూడకుండా పేమెంట్ త్వరగా అవుతుంది.
- భద్రత ఎన్ని రకాలుగా పెరిగినా, మీ పిన్ (PIN) లేదా ఓటీపీ (OTP) ఎవరితోనూ పంచుకోకండి.
