“నీ కూతురిని ఒక రాత్రికి పంపించు.. ₹10,000 ఇస్తాను”; జైలు ఖైదీతో సొంత కూతురిని పంపమన్న పోలీస్ అధికారి.. సభ్యసమాజం తలదించుకునే ఘటన..!!!

మహారాష్ట్రలోని అకోలాలో, జైలులో ఉన్న ఒక మహిళా ఖైదీతో ఆమె కూతురిని వ్యభిచారానికి పంపమని బేరమాడిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) తీరు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

అకోలా నగరంలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో కొద్ది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ₹80 లక్షల ఆర్థిక మోసం కేసులో అరెస్ట్ అయిన ఒక మహిళ అక్కడి జైలు గదిలో ఉంది. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ASI రాజేష్ జాదవ్, ఆ మహిళను ఆమె కూతురి వయస్సు ఎంత అని అడిగాడు.

దానికి ఆ మహిళ, తన కూతురికి 27 ఏళ్లు అని చెప్పింది. వెంటనే ఆ అధికారి, “ఈ వయసు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ₹10 వేలు ఇస్తాను, నీ కూతురిని ఒక రాత్రికి నా దగ్గరకు పంపించు” అని అత్యంత అసభ్యంగా మాట్లాడాడు.

ఈ విషయం తెలుసుకున్న ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఇన్‌స్పెక్టర్ (PI) అనిల్ జుమ్లే వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితురాలు ఏడుస్తూ జరిగిన విషయాన్ని ఆయనకు వివరించింది. ఇది విని ఆగ్రహం చెందిన ఇన్‌స్పెక్టర్ అనిల్, సదరు ASI రాజేష్ జాదవ్‌ను కొట్టబోయారు. అయితే, అతను యూనిఫామ్‌లో ఉన్నాడనే విషయాన్ని గుర్తుచేస్తూ, “యూనిఫామ్ వేసుకున్న నీకు ఇలా మాట్లాడటానికి సిగ్గు అనిపించలేదా?” అని తీవ్రంగా మందలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో బాధితురాలు ఏడుస్తూ.. “అయ్యా, నా కూతురికి 27 ఏళ్లు అని చెప్పగానే, ₹10 వేలు ఇస్తాను ఆమెను ఒక రాత్రికి పంపించు అంటున్నాడు. తప్పు చేసింది నేను, నా కూతురు ఏం చేసింది? ఆమె గురించి ఇలా మాట్లాడటానికి ఇతనికి మనసు ఎలా వచ్చింది?” అని ప్రశ్నిస్తోంది. వెంటనే ఇన్‌స్పెక్టర్ అనిల్ జుమ్లే ఆ ASIపై విరుచుకుపడుతూ.. “యూనిఫామ్ వేసుకున్నాననే భయం లేదా? ఒక మహిళతో ఇలాగేనా మాట్లాడేది?” అని గద్దించారు.

ఈ వ్యవహారాన్ని అకోలా పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్‌గా తీసుకుంది. పోలీస్ స్టేషన్ లోపలే ఒక మహిళకు భద్రత లేకపోవడంపై ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ASI రాజేష్ జాదవ్‌ను తక్షణమే సస్పెండ్ (Suspension) చేసేందుకు చర్యలు ప్రారంభించారు.


Posted

in

by

Tags: