AIADMK, విజయ్ పార్టీ.. అంతా ఖేల్ ఖతం! ఊడ్చిపారేయనున్న డీఎంకే; 3 ప్రధాన సర్వేల సంచలన అంచనాలు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దిశగా రాజకీయాలు శరవేగంగా కదులుతున్నాయి. కూటముల లెక్కలు, విధానాల ప్రకటనలు ఒకవైపు ఉంటే, “ప్రజల మద్దతు ఎవరికి?” అనే ప్రశ్నకు సమాధానంగా మూడు ప్రముఖ సంస్థలు వెల్లడించిన సర్వేలు విజయ్ పార్టీ (TVK) మరియు AIADMKలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేశాయి.

1. ‘లోక్ పోల్’ (Lok Pol) సర్వే అంచనాలు:

లోక్ పోల్ మెగా సర్వే ప్రకారం, తమిళనాడులో మళ్ళీ DMK కూటమే అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది.

  • DMK కూటమి: 181 నుండి 189 స్థానాల్లో విజయం సాధించి, సుమారు 40.1% ఓట్లను పొందుతుందని అంచనా. ఇది డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
  • తమిళగ వెట్రి కళగం (TVK): విజయ్ పార్టీ 8 నుండి 10 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. అయితే, పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే 23.9% ఓట్లు సాధించడం ఒక కొత్త ధ్రువం ఉదయించడాన్ని సూచిస్తోంది.
  • AIADMK+: 38 నుండి 42 స్థానాలకే పరిమితం కావచ్చు. ఓట్ల శాతం 29% ఉన్నప్పటికీ, సీట్ల సంఖ్యలో గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
2. ‘అగ్ని న్యూస్ సర్వీస్’ (Agni News Services) సర్వే:

ఈ సర్వే ప్రకారం డీఎంకే కూటమి అసుర బలంతో దూసుకుపోతోంది.

  • మొత్తం స్థానాలు: డీఎంకే కూటమి ఏకంగా 180 స్థానాల్లో ఆధిక్యం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. AIADMK కూటమి కేవలం 54 స్థానాలకే పరిమితమవుతుంది.
  • రీజియన్ల వారీగా: చెన్నై రీజియన్‌లోని 37 స్థానాల్లో 36 డీఎంకే గెలుచుకోగా, AIADMKకు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కుతుంది. కొంగు మండలం (పశ్చిమ తమిళనాడు) లోనూ డీఎంకే 32 సీట్లతో ముందంజలో ఉంది.
  • విజయ్ ప్రభావం: విజయ్ పార్టీకి 9.7% ఓట్లు లభించి మూడవ స్థానంలో నిలుస్తుంది. ఇది ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకులో స్వల్ప అలజడిని మాత్రమే సృష్టించగలదని ఈ సర్వే చెబుతోంది.
3. ‘పోల్ ట్రాకర్’ (Poll Tracker) సర్వే:

ఈ సర్వే కూడా అధికార పార్టీకే జై కొట్టింది.

  • DMK కూటమి: 172 నుండి 178 స్థానాలను కైవసం చేసుకుని, 42.7% ఓట్ల బలంతో అజేయ శక్తిగా మారుతుందని పేర్కొంది.
  • TVK (విజయ్ పార్టీ): 19.2% ఓట్లు సాధించినప్పటికీ, సీట్ల విషయానికి వస్తే కేవలం 6 నుండి 12 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓట్ల శాతం భారీగా ఉన్నా, అవి సీట్లుగా మారకపోవడం విజయ్ పార్టీకి పెద్ద మైనస్.
  • AIADMK: 30.3% ఓట్లతో 46 నుండి 52 స్థానాలను గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుంది.
  • నామ్ తమిళర్ కట్చి: సీమాన్ నేతృత్వంలోని ఈ పార్టీకి 5.1% ఓట్లు, 0 నుండి 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

Posted

in

by

Tags: