పొలం అమ్మి భార్యకు భరణం ఇచ్చిన భర్త.. ఆ వేదన నిండిన వీడియో నెటిజన్ల కన్నీరు మునిగిస్తోంది

తాను కష్టపడి సంపాదించిన పొలాన్ని అమ్మి, ఆ డబ్బును భార్యకు భరణం (Alimony) రూపంలో ఇచ్చాడో భర్త. ఆ డబ్బును ఆమె చేతిలో పెడుతున్నప్పుడు అతని కళ్ళలో కనిపించిన బాధ నెటిజన్ల మనసును కలచివేస్తోంది.

మన దేశంలో చట్టాలు ఎప్పుడూ మహిళలకే ప్రాధాన్యత ఇస్తుంటాయి. అయితే కొన్నిసార్లు ఇది పురుషులకు శాపంగా మారుతుంటుంది. ముఖ్యంగా విడాకుల సమయంలో పురుషులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు.

ఇక్కడ కూడా అదే జరిగింది. భార్యాభర్తలు కాపురం మొదలుపెట్టి కేవలం నాలుగు నెలలే అయ్యింది. అప్పుడే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఫలితంగా వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది. పెద్దల సమక్షంలో పంచాయితీ జరగగా, భార్యకు భరణం ఇవ్వాలని ఒప్పందం కుదిరింది.

ఈ మొత్తాన్ని చెల్లించడానికి ఆ భర్త తనకున్న పొలాన్ని విక్రయించాడు. ఆ డబ్బును భార్య చేతికి అందిస్తూ, ఆవేదనతోనే ఆమెకు చేతులెత్తి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, “విడాకుల సమయంలో పురుషుల బాధను వినేవారే లేరు” అంటూ చాలా మంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: