ట్రంప్ ఇరాన్ యుద్ధం: “ప్రాంతమంతా అగ్నిజ్వాలల్లో కాలిపోతుంది” – ఇరాన్ హెచ్చరిక; హోర్ముజ్‌ను తెరవడానికి షరతు ఏమిటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తెరవాలని ఇరాన్‌కు డెడ్‌లైన్ విధించారు. మంగళవారం సాయంత్రం లోపు దీనిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు సదా, తిరుగుదాడికి సిద్ధమైంది.

ఇరాన్ పెట్టిన నిబంధన ఏమిటి?
హార్ముజ్ జలసంధిని తెరవాలంటే అమెరికా ముందు ఇరాన్ ఒక షరతు పెట్టింది. ఇరాన్ అధ్యక్ష కార్యాలయ అధికారి మెహదీ తబతాబాయి స్పందిస్తూ— యుద్ధం కారణంగా ఇరాన్‌కు వాటిల్లిన నష్టాన్ని పూడ్చేందుకు, జలసంధి ద్వారా జరిగే రవాణా ఛార్జీలలో (Transport Fees) ఒక భాగాన్ని తమకు చెల్లిస్తేనే దానిని తెరుస్తామని స్పష్టం చేశారు.

“ప్రాంతమంతా బూడిదవుతుంది” – ఇరాన్ స్పీకర్ హెచ్చరిక
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కలిబాఫ్, ట్రంప్ చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ట్రంప్ బాధ్యతారహితమైన నిర్ణయాల వల్ల పశ్చిమ ఆసియా మొత్తం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. “మీరు నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని) ఆదేశాలను గుడ్డిగా పాటిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతమంతా తగలబడి సాంబలవుతుంది. మీ చర్యలు అమెరికాలోని ప్రతి కుటుంబాన్ని నరకంలోకి నెట్టేస్తాయి” అని ఆయన ఎక్స్‌ (X) వేదికగా పోస్ట్ చేశారు.

ట్రంప్ ‘అంతిమ హెచ్చరిక’ (Deadline):
ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ (TruthSocial) ఖాతాలో అమెరికా ఎప్పుడు దాడి చేయబోతుందో కూడా సూచనప్రాయంగా తెలిపారు.

గడువు: తూర్పు ప్రామాణిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం) లోపు ఇరాన్ స్పందించాలి.

హెచ్చరిక: “హార్ముజ్ జలసంధిని తెరవండి, లేదంటే మీరు నరకానికి వెళ్తారు. మంగళవారం రోజున ఇరాన్ తన విద్యుత్ కేంద్రాలను, వంతెనలను కోల్పోతుంది. అల్లాను ప్రార్థించుకోండి!” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఒప్పందం కుదురుతుందన్న ఆశ:
మరోవైపు, సోమవారం లోపు ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, “చర్చలు జరుగుతున్నాయి, సోమవారం ఏదైనా మంచి జరగొచ్చు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, అన్నింటినీ పేల్చేసి చమురును మా ఆధీనంలోకి తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నాను” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ పరిణామాలు ప్రపంచ దేశాలలో ఆందోళన కలిగిస్తున్నాయి, ఎందుకంటే హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం.


Posted

in

by

Tags: