హైదరాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ ఒక ప్లేట్ హైదరాబాదీ బిర్యానీ తింటూ కెమెరాకు కన్నీళ్లతో చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
క్లాసెన్ బిర్యానీని ఆస్వాదించడానికి ప్రయత్నించినప్పటికీ, అది అతనికి ఒక విభిన్నమైన అనుభవాన్ని మిగిల్చింది.
హైదరాబాదీ బిర్యానీ
ఈ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దానికి “అతను కష్టపడే ఏకైక సందర్భం ఇదే” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో నితీష్ కుమార్ రెడ్డితో పాటు హెన్రిచ్ క్లాసెన్ హైదరాబాదీ బిర్యానీ తింటూ కనిపించారు.
కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్
కొన్ని ముద్దలు తిన్న తర్వాత, బిర్యానీలోని కారం మరియు మసాలాలు క్లాసెన్‌కు చుక్కలు చూపించాయి. కారం తాళలేక అతనికి విపరీతంగా చెమటలు పట్టాయి, కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. క్లాసెన్ ఒక గుడ్డతో తన కన్నీళ్లను, చెమటను తుడుచుకుంటూ కనిపించారు. అయితే, పక్కనే ఉన్న నితీష్ కుమార్ రెడ్డి మరియు ఇతర ఆటగాళ్లు క్లాసెన్ రియాక్షన్‌ను చూసి నవ్వుకుంటూ ఆ క్షణాన్ని ఆస్వాదించారు.
