ప్రపంచం దృష్టి ఒకవైపు అమెరికా రెస్క్యూ ఆపరేషన్ (F-15 ఈగిల్ పైలట్‌ను రక్షించే ప్రయత్నం)పై ఉన్న సమయంలో, తెర వెనుక ఎవరూ ఊహించని ఒక పెద్ద ‘గేమ్’ జరిగింది. ఎటువంటి శబ్దం లేకుండా, నేరుగా అమెరికాకే సవాలు విసురుతూ చైనా ఈ ఆపరేషన్ పూర్తి చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
చైనా తన కార్గో విమానాలను ఇరాన్‌కు పంపిందని, అందులో ఆయుధాలను చేరవేయడమే కాకుండా, తిరిగి వచ్చేటప్పుడు ఇరాన్ వద్ద ఉన్న అత్యంత కీలకమైన యురేనియంను కూడా తన దేశానికి తీసుకెళ్లిందని సమాచారం. బయటకు ఇవి లాజిస్టిక్ విమానాల్లా కనిపించినా, లోపల మాత్రం క్షిపణి భాగాలు, రక్షణ పరికరాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
చైనా వ్యూహం ఏమిటి? అమెరికా ప్రధాన లక్ష్యం ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతం చేయడం. ఒకవేళ చైనా ఆ యురేనియంను తన వద్దకు తీసుకెళ్తే, అమెరికాకు అది నేరుగా సవాలు విసిరినట్లే. “ధైర్యముంటే ఇప్పుడు మా (చైనా) దగ్గరకు వచ్చి దీనిని తీసుకెళ్లండి” అని అమెరికాకు సందేశం ఇచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఇరాన్‌ను కాపాడటమే కాకుండా, చైనా తన వ్యూహాత్మక బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లవుతుంది.
అమెరికా తన పైలట్‌ను రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, మీడియా దృష్టి అంతా అటే ఉన్న సమయంలో చైనా ఈ ఆపరేషన్ పూర్తి చేసిందని అంటున్నారు. అంటే ముందు యుద్ధం చూపిస్తూ.. వెనుక తన ఎత్తుగడను పారించింది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదా గట్టి ఆధారాలు బయటకు రాలేదు.
ఒకవేళ ఈ వార్త నిజమైతే, మధ్యప్రాచ్య (Middle East) యుద్ధ గమనం పూర్తిగా మారిపోతుంది. ఇరాన్‌కు అణు రక్షణ కవచం లభించినట్లవుతుంది మరియు ప్రపంచ శక్తి సమతుల్యత (Power Balance) తలకిందులవుతుంది. అమెరికాను బురిడీ కొట్టించి చైనా ఈ ఆట ఆడిందా? రాబోయే రోజుల్లో ఇది ప్రపంచ చిత్రపటాన్నే మార్చేసే అవకాశం ఉంది.
