సెల్యూట్ రేవతి! ఖాకీ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన సామాన్య కానిస్టేబుల్.. తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష పడేలా చేసిన ‘ఒక్కగానొక్క’ సాక్షి!

మధురై/తమిళనాడు: న్యాయం చచ్చిపోలేదని, సత్యం వైపు నిలబడే ధైర్యం ఉంటే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెట్టవచ్చని కానిస్టేబుల్ రేవతి నిరూపించారు. 2020లో తమిళనాడును కుదిపేసిన ‘సాతాన్‌కుళం’ లాకప్ డెత్ కేసులో మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అమాయకులైన తండ్రీకొడుకులను పొట్టనబెట్టుకున్న తొమ్మిది మంది పోలీసు అధికారులకు మరణదండన విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ విజయం వెనుక ఉన్న అసలైన శక్తి.. కానిస్టేబుల్ రేవతి. సొంత శాఖలోని ఉన్నతాధికారులను ఎదిరించి, ప్రాణాలకు తెగించి ఆమె చెప్పిన సాక్ష్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఏమిటా పాశవిక కాండ?

2020 జూన్ 19న లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించి 15 నిమిషాల అదనంగా దుకాణం తెరిచారన్న సాకుతో జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం తమ మాట వినలేదన్న అహంకారంతో ఎస్‌ఐ బాలకృష్ణన్, ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ మరియు ఇతర సిబ్బంది వారిద్దరినీ స్టేషన్లో బంధించి, ఇనుప రాడ్లు, కర్రలతో చిత్రహింసలు పెట్టారు. బూటు కాళ్లతో ప్రైవేట్ భాగాలపై తొక్కుతూ పైశాచికానందం పొందారు. తీవ్ర రక్తస్రావం, గాయాల కారణంగా తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు.

ధైర్యానికి మారుపేరు ‘రేవతి’

ఈ ఘోరం జరిగిన నాడు రేవతి అదే పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీలో ఉన్నారు. ఉన్నతాధికారుల అకృత్యాలను ఆమె కళ్లారా చూశారు. నిందితులంతా ప్రభావవంతమైన వ్యక్తులు కావడంతో సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించారు. కానీ, రేవతి మాత్రం భయపడలేదు.

  • పిల్లల కోసం ఆందోళన: ఈ కేసును విచారించిన మేజిస్ట్రేట్ భారతీదాసన్ ముందు రేవతి ఒకే ఒక మాట అడిగారు. “సార్, నేను మీకు ప్రతి అంగుళం నిజం చెబుతాను. కానీ నాకు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. నా ఉద్యోగానికి, నా పిల్లల ప్రాణాలకు మీరు హామీ ఇవ్వగలరా?” అని అడిగి, ఆపై నిజాలను ఎలెత్తుగడ్డారు.
స్టేషన్‌లో ఆ రాత్రి జరిగిన నరకం!

నిందితులు తండ్రీకొడుకులను కొడుతూ మధ్యమధ్యలో మద్యం సేవించడానికి విరామం తీసుకునేవారని రేవతి సాక్ష్యం ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న జయరాజ్‌కు ఆమె కాఫీ ఇచ్చే ప్రయత్నం చేయగా, తోటి పోలీసులు దానిని ఒలకబోశారు. బెన్నిక్స్‌ను వివస్త్రను చేసి పైపులు, రాడ్లతో కొడుతుంటే ఆ అరుపులు వినలేక తాను స్టేషన్ బయటకు వెళ్లిపోయానని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.


Posted

in

by

Tags: