న్యూఢిల్లీ/కైరో: ప్రపంచ దేశాలన్నీ యుద్ధ మేఘాల మధ్య వణికిపోతుంటే.. భారత్ మాత్రం తన వ్యూహాత్మక వేగాన్ని పెంచింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో అందరూ ఆశ్చర్యపోయేలా భారత సైన్యం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ఆశ్చర్యపోయేలా, ప్రపంచం నివ్వెరపోయేలా భారత ‘స్పెషల్ ఫోర్సెస్’ (పారా కమాండోలు) ఇప్పుడు మధ్యప్రాచ్యానికి అత్యంత సమీపంలో గర్జించబోతున్నారు.
ఆపరేషన్ ‘సైక్లోన్-4’: దూసుకెళ్లిన 25 మంది యోధులు
భారత సైన్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన 25 మంది స్పెషల్ ఫోర్స్ కమాండోల బృందం ఈజిప్ట్ బయలుదేరి వెళ్లింది. ఏప్రిల్ 10 నుండి 17 (2026) వరకు ఈజిప్ట్‌లోని అన్షాస్ (Anshas) ప్రాంతంలో జరగనున్న ‘సైక్లోన్-4’ (Cyclone-IV) సంయుక్త విన్యాసాల్లో వీరు పాల్గొనబోతున్నారు. ఎడారి ప్రాంతాల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించడం, అత్యంత క్లిష్టమైన మిషన్లను ప్లాన్ చేయడంలో ఇరు దేశాల కమాండోలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు.
ఎందుకు ఈ విన్యాసం ఇంత హాట్ టాపిక్?
- వ్యూహాత్మక స్థానం: ఇజ్రాయెల్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండే ఈజిప్ట్ గడ్డపై భారత కమాండోలు దిగడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
- స్వతంత్ర విదేశాంగ నీతి: ఒకవైపు ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా, భారత్ తన సైనిక వ్యూహాలను ఏమాత్రం ఆపడం లేదు. “మా మార్గం.. మా ఇష్టం” అనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి పంపింది.
- స్వేజ్ కాలువ రక్షణ: భారత్ నుంచి యూరప్ వెళ్లే వాణిజ్య మార్గమైన స్వేజ్ కాలువపై ఈజిప్ట్‌కు పూర్తి ఆధిపత్యం ఉంది. ఈ దేశంతో సైనిక సంబంధాలు పెంచుకోవడం ద్వారా భారత్ తన వాణిజ్య ప్రయోజనాలను కూడా కాపాడుకుంటోంది.
పాక్ ఆలోచనలో పడగా.. భారత్ యాక్షన్ లోకి!
ఇస్లామాబాద్‌లో శాంతి చర్చల సాకుతో పాకిస్థాన్ కాలక్షేపం చేస్తుంటే, భారత్ మాత్రం సైనిక సమర్థతను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈజిప్ట్ కూడా BRICS లో సభ్యదేశం కావడంతో, ఈ కూటమి బలం పెరుగుతోందనే దానికి ఇది ఒక నిదర్శనం.
