వైద్యుల రహస్యం: వారు ఆరోగ్యంగా ఉండటానికి చేసే పనులేంటి? రోగులకు ఎందుకు చెప్పరు?

హెల్త్ డెస్క్: మనం ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ డాక్టర్లు కొన్ని విషయాలను రోగులకు అస్సలు చెప్పరు. ఎందుకంటే అందులో కొంతమంది వైద్యుల స్వార్థం లేదా లాభం దాగి ఉండవచ్చు. అయితే, నిరంతరం రోగుల మధ్య ఉండే డాక్టర్లు తాము ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేస్తారో మీకు తెలుసా?

చాలా మంది వైద్యులు తమ వ్యక్తిగత ఆరోగ్య రహస్యాలను బయట పెట్టరు. యాంటీబయోటిక్స్ వాడకం నుండి రక్త పరీక్షల వరకు.. వైద్యులు తమ రోగులకు చెప్పకుండా పాటించే ఆ ఆసక్తికర విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

  • యాంటీబయోటిక్స్‌కు దూరం: సాధారణ జలుబు లేదా దగ్గు వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్లు యాంటీబయోటిక్స్ తీసుకోరు. ఎందుకంటే జలుబు వైరస్ వల్ల వస్తుందని, దానికి యాంటీబయోటిక్స్ పనిచేయవని వారికి తెలుసు. అనవసరంగా మందులు వాడి శరీరాన్ని ఇబ్బంది పెట్టరు.
  • బ్రాండెడ్ వద్దు.. జనరిక్ ముద్దు: డాక్టర్లకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే, వారు భారీ ధరలు ఉండే బ్రాండెడ్ మందుల జోలికి వెళ్లరు. తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే వాడతారు. ఎందుకంటే రెండింటిలోనూ ఉండే ఫార్ములా ఒక్కటే అని, కేవలం పేరు కోసమే 80% అదనపు ధర వసూలు చేస్తారని వారికి తెలుసు.
  • సప్లిమెంట్ల మాయలో పడరు: టీవీ ప్రకటనల్లో వచ్చే రకరకాల హెల్త్ సప్లిమెంట్లను డాక్టర్లు అస్సలు వాడరు. వారు కేవలం విటమిన్-డి మరియు ఫిష్ ఆయిల్ మాత్రమే తీసుకుంటారు. మిగిలిన సప్లిమెంట్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వారికి స్పష్టంగా తెలుసు.
  • ఆకలి వేస్తే ముందుగా నీళ్లు: బాగా ఆకలి వేస్తున్నట్లు అనిపించినప్పుడు వైద్యులు మొదట నీళ్లు తాగుతారు. ఎందుకంటే మన మెదడు కొన్నిసార్లు దాహానికి, ఆకలికి మధ్య తేడాను గుర్తించలేదు. నీళ్లు తాగడం వల్ల అనవసరంగా ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.
  • నియమిత పరీక్షలు తప్పనిసరి: తాము ఆరోగ్యంగా ఉన్నామనిపించినా, డాక్టర్లు ఏటా ఫుల్ బాడీ చెకప్ లేదా రక్త పరీక్షలు చేయించుకుంటారు. కొన్ని ప్రాణాంతక వ్యాధులు బయటకు ఎలాంటి లక్షణాలు చూపించకుండానే ప్రాణాలు తీయగలవని వారికి తెలుసు. అందుకే ముందస్తు జాగ్రత్త వహిస్తారు.
  • వ్యాయామం కంటే నిద్రకే ప్రాధాన్యత: డాక్టర్లు వ్యాయామం కంటే నిద్రకే ఎక్కువ విలువ ఇస్తారు. మీరు ఎంత వర్కౌట్ చేసినా, సరిగ్గా నిద్రపోకపోతే ఆ నష్టాన్ని పూడ్చలేమని వారికి తెలుసు. అందుకే కనీసం 6 గంటల గాఢ నిద్ర అవసరమని వారు నమ్ముతారు.
  • చిన్న లక్షణాన్ని కూడా వదలరు: సాధారణ గొంతు నొప్పిని కూడా డాక్టర్లు నిర్లక్ష్యం చేయరు. ఎందుకంటే అది గొంతు క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణం కావచ్చని వారికి తెలుసు. ఏదైనా సమస్యను మొదటి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని వారు గ్రహిస్తారు.

Posted

in

by

Tags: