“నాకు పెళ్లవుతోంది!” — తన మాజీ ప్రేయసికి పెళ్లి పత్రిక ఇవ్వడానికి గదిలోకి వెళ్లిన ప్రియుడు. కిటికీలోంచి తన భార్య నగ్నంగా ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతితో అరిచిన భర్త. సంచలన వీడియో!!!

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానన్న సంతోషంతో తన పాత ప్రియురాలికి తీపి కబురు చెప్పేందుకు వెళ్లిన ఓ యువకుడు.. ఆమెతో ఏకాంతంగా గడుపుతూ భర్తకు అడ్డంగా దొరికిపోయాడు. కిటికీలోంచి తన భార్య పరాయి వ్యక్తితో అసభ్యకర స్థితిలో ఉండటం చూసిన భర్త ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అనంతరం బంధువులు, స్థానికులు కలిసి ఆ యువకుడిని చితకబాదారు.

అసలేం జరిగిందంటే?

బిజ్నోర్ జిల్లా నహతౌర్ ప్రాంతానికి చెందిన ఆసిఫ్ ఖురేషి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రంజాన్ పండుగ కోసం ఇంటికి వచ్చిన ఆసిఫ్‌కు ఘజియాబాద్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. తన పెళ్లి ఖాయమైందన్న సంతోషంతో, దుబాయ్ నుంచి తెచ్చిన ఖర్జూరాలు, స్వీట్లు తీసుకుని షేర్ కోట్ ప్రాంతంలో నివసిస్తున్న తన మాజీ ప్రియురాలిని కలిసేందుకు వెళ్లాడు. ఆ మహిళకు ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ, వారిద్దరూ పాత పరిచయంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

కిటికీలోంచి చూసి షాక్..

గదిలోకి వెళ్లిన వారు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త, బంధువులు కిటికీలోంచి లోపలికి తొంగి చూశారు. అక్కడ ఆసిఫ్ మరియు ఆ మహిళ నగ్నంగా, అసభ్యకర స్థితిలో ఉండటం చూసి వారు నిర్ఘాంతపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి ఆసిఫ్‌ను బయటకు ఈడ్చుకొచ్చారు.

వీధిలో విచక్షణారహితంగా దాడి

గదిలోంచి బయటకు లాక్కొచ్చిన ఆసిఫ్‌ను స్థానికులు, బంధువులు కలిసి విచక్షణారహితంగా చితకబాదారు.

“నా వదిన ఫోన్లో ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది. అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పేది. ఈ రోజు ఈ యువకుడు స్వీట్లతో రావడంతో మాకు అనుమానం వచ్చి నిఘా పెట్టాం. మా కుటుంబ గౌరవం పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు కానీ, అతనికి బుద్ధి వచ్చేలా దర్మ దెబ్బలు కొట్టాం” అని ఆ మహిళ బావ మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం ఆసిఫ్‌ను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్ నుంచి వచ్చి పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు, పరాయి భార్యతో దొరికిపోయి ఇలా వీధిలో తన్నులు తినడం స్థానికంగా పెను సంచలనంగా మారింది.


Posted

in

by

Tags: