పాట్నా: పార్క్‌లో ప్రియురాలితో ఏకాంతంగా సమయం గడుపుతూ, చేతులు జేబులో పెట్టుకుని స్టైల్‌గా కబుర్లు చెబుతున్నాడో ప్రబుద్ధుడు. సీన్ కట్ చేస్తే.. సరిగ్గా అదే సమయానికి అక్కడికి అతని భార్య ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది.. అక్కడ కేవలం మాటల యుద్ధం మాత్రమే జరగలేదు, తన భర్త ప్రియురాలికి ఆ భార్య గట్టిగా బుద్ధి చెప్పింది. ప్రియురాలిని కాపాడటానికి ఆ యువకుడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఈ రోమాంచిత ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక పార్కు సమీపంలోని ఖాళీ ప్రదేశంలో యువకుడు, యువతి ఏకాంతంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే మరో మహిళ అక్కడికి చేరుకుంది. వీరిద్దరినీ కలిసుండటం చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె, వెంటనే గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా తన కాలి చెప్పు (షూ) తీసి ఆ యువతిపై విరుచుకుపడింది.
యువకుడు అడ్డుకోవాలని చూసినా భార్య కోపానికి అతనికి కూడా దెబ్బలు పడ్డాయి. వీడియోలో ఉన్న యువకుడు వివాహితుడని, అతనితో ఉన్నది ప్రియురాలని, దాడి చేసిన మహిళ అతని భార్య అని తెలుస్తోంది. భర్త అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భార్య ఇలా నడిరోడ్డుపైనే అతనికి, అతని ప్రియురాలికి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో చర్చాంశనీయం
‘ఘర్ కే కలేష్’ (Ghar Ka Kalesh) అనే ఎక్స్ (X) ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయగా, వేల సంఖ్యలో నెటిజన్లు దీనిని వీక్షించారు. వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.
- “ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి, సోషల్ మీడియా ఓపెన్ చేయడమే కష్టంగా ఉంది” అని ఒకరు కామెంట్ చేయగా..
- “పాకిస్థానీ యువకుడు తన అక్రమ సంబంధానికి తగిన శాస్తి అనుభవించాడు” అని మరొకరు రాశారు.
మొత్తానికి, భార్య కంటపడ్డ ఈ భర్త ‘పార్కు రొమాన్స్’ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
