భారత రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా మొదలైంది. ఒకప్పుడు ఈవీ అంటే కేవలం సిటీ ప్రయాణాలకే పరిమితం అనుకునే వారు, కానీ ఇప్పుడు వస్తున్న మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఆ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లు, గరిష్ట భద్రతతో పాటు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే టాప్-9 మోడల్స్ మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి. ఆ పవర్ఫుల్ ఈవీల వివరాలు ఇప్పుడు చూద్దాం:
- మహీంద్రా BE 6: రేంజ్ అంటే ఇదే!
ARAI క్లెయిమ్ రేంజ్: 683 కి.మీ.
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన మోడల్ మహీంద్రా BE 6. స్టైలిష్ లుక్ మరియు తేలికపాటి బరువుతో ఇది అత్యధిక రేంజ్‌ను అందిస్తోంది. 79kWh బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 683 కి.మీ ప్రయాణించవచ్చు. - మహీంద్రా XEV 9S: ఫ్యామిలీ కోసం బెస్ట్!
ARAI క్లెయిమ్ రేంజ్: 679 కి.మీ.
భారతదేశపు మొట్టమొదటి మాస్-మార్కెట్ 3-రో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇది. మూడు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తున్న ఈ మోడల్, 79kWh బ్యాటరీతో 679 కి.మీ రేంజ్ ఇస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాల్యూ ఇచ్చే కారుగా ఇది నిలుస్తోంది. - మహీంద్రా XEV 9e: టెక్నాలజీ కింగ్!
ARAI క్లెయిమ్ రేంజ్: 656 కి.మీ.
‘బోర్న్ ఎలక్ట్రిక్’ ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కారులో BYD యొక్క ప్రసిద్ధ ‘బ్లేడ్ సెల్ టెక్నాలజీ’ని వాడారు. ఇది 79kWh యూనిట్‌తో 650 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే వీలు కల్పిస్తుంది. - టాటా హారియర్ EV: ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం..
ARAI క్లెయిమ్ రేంజ్: 627 కి.మీ.
AWD (ఆల్ వీల్ డ్రైవ్) సెటప్‌తో వస్తున్న శక్తివంతమైన కారు. 75kWh బ్యాటరీ ప్యాక్‌తో కేవలం 6.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని పవర్ఫుల్ మోటార్ 504Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. - మారుతి సుజుకి e-విటారా: సామాన్యుడి ఎలక్ట్రిక్ కల!
ARAI క్లెయిమ్ రేంజ్: 543 కి.మీ.
మారుతి నుంచి వస్తున్న తొలి ఈవీ ఇది. ‘బ్యాటరీ-ఏజ్-ఏ-సర్వీస్’ (BaaS) పథకం ద్వారా ఇది అత్యంత సరసమైన ధరకు లభించే అవకాశం ఉంది. 61kWh బ్యాటరీ వెర్షన్ 543 కి.మీ రేంజ్‌ను ప్రామిస్ చేస్తోంది. - విన్‌ఫాస్ట్ VF7: అత్యంత వేగవంతమైన ఈవీ!
ARAI క్లెయిమ్ రేంజ్: 532 కి.మీ.
వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్ నుంచి వచ్చిన ఈ మోడల్ కేవలం 5.8 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. AWD సెటప్‌తో వస్తున్న అత్యంత చవకైన కారుగా ఇది రికార్డు సృష్టించింది. - BYD అట్టో 3: గ్లోబల్ ఈవీ!
ARAI క్లెయిమ్ రేంజ్: 521 కి.మీ.
ఇది పూర్తిగా విదేశాల నుంచి విడిభాగాలను తెప్పించి (CKD) ఇక్కడ అసెంబ్లీ చేస్తారు. అద్భుతమైన బ్యాటరీ ప్యాక్ మరియు ప్రీమియం ఫీచర్లతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది. - హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్: నమ్మకానికి మారుపేరు!
ARAI క్లెయిమ్ రేంజ్: 510 కి.మీ.
భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న క్రెటా మోడల్‌కు ఇది ఎలక్ట్రిక్ వెర్షన్. 51.4kWh బ్యాటరీ ఆప్షన్ 510 కిలోమీటర్ల మెరుగైన రేంజ్‌ను అందిస్తుంది. - టాటా కర్వ్ EV: డిజైన్ అదిరింది!
ARAI క్లెయిమ్ రేంజ్: 502 కి.మీ.
కూపే-ఎస్యూవీ బాడీ స్టైల్‌తో ఈ కారు అందరినీ ఆకట్టుకుంటోంది. 55kWh బ్యాటరీ వెర్షన్ 167hp పవర్‌తో లాంగ్ డ్రైవ్స్‌కు సరైన ఎంపికగా నిలుస్తోంది.
