ముంబై ఇండియన్స్‌లో భారీ విప్లవం.. రోహిత్ శర్మ సహా ఐదుగురు స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన తప్పదా?

ముంబై ఇండియన్స్ 5 గురు స్టార్లను వదిలేసే అవకాశం: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ 19వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో మాత్రమే ముంబై విజయం సాధించింది.

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందని అందరూ భావించారు. కానీ తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత ముంబై జట్టు వరుస ఓటములతో పూర్తిగా దారి తప్పింది. దీంతో వచ్చే సీజన్ (2027) కోసం ఐదుగురు సీనియర్ ఆటగాళ్లను జట్టు నుండి తప్పించనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

జట్టును వీడనున్న ఐదుగురు స్టార్లు వీరేనా?
  1. సూర్యకుమార్ యాదవ్: ఈ సీజన్ తర్వాత ముంబై జట్టు సూర్యకుమార్ యాదవ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. సూర్య చాలా కాలంగా ఫామ్‌లో లేడు. ఈ సీజన్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. 2018 నుండి ముంబై జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సూర్య భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
  2. రోహిత్ శర్మ: హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయినప్పటి నుండి రోహిత్ శర్మ ముంబై జట్టును వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 30న రోహిత్ 39వ ఏట అడుగుపెట్టబోతున్నాడు. ముంబైకి 5 ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ను వచ్చే మెగా వేలం దృష్ట్యా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
  3. ట్రెంట్ బౌల్ట్: న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ సీజన్‌లో వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బౌలింగ్ వేగం, స్వింగ్ తగ్గడం వల్ల అతను విఫలమవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
  4. దీపక్ చాహర్: ఈ సీజన్‌లో ముంబై జట్టు దీపక్ చాహర్‌ను రూ. 9.75 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆ భారీ ధరతో తదుపరి సీజన్‌లో కొత్త పేసర్‌ను తీసుకోవాలని జట్టు యోచిస్తోంది.
  5. తిలక్ వర్మ: తిలక్ వర్మ విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. 2022 నుండి ముంబై జట్టులో ఉన్న తిలక్ ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతను చేసిన 8 అర్ధ సెంచరీలలో ముంబై 7 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం.

Posted

in

by

Tags: