నోరు విప్పిన శ్రీదేవి ఆత్మ? మరణించిన చోటే అసలు రహస్యం బయటపెట్టిన ఇన్వెస్టిగేటర్!

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ప్రతిభావంతురాలు, అతిలోక సుందరి శ్రీదేవి. చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, దక్షిణాది చిత్ర పరిశ్రమ నుండి బాలీవుడ్ వరకు దశాబ్దాల కాలం పాటు ‘లేడీ సూపర్ స్టార్’గా ఏలారు. అయితే ఆమె మరణానికి గల అసలు కారణం ఏంటన్నది ఇప్పటికీ చాలా మందికి ఒక పెద్ద మిస్టరీ.

శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి ఎలా మరణిస్తారు? అని అప్పట్లో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా సౌరభ్ పూనియా అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. తాను శ్రీదేవి ఆత్మతో మాట్లాడానని సంచలన విషయాలు వెల్లడించారు.

బాలనటిగా మొదలై.. కథానాయికగా మెరిశారు! శ్రీదేవి కన్నడలో డాక్టర్ రాజ్‌కుమార్‌తో కలిసి ‘భక్త కుంబార’ చిత్రంలో బాలనటిగా నటించారు. సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత, 2012లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆమె చివరి చిత్రం ‘మామ్’ (MOM) కు గాను మరణానంతరం ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం ఆమెను 2013లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది.

దుబాయ్‌లో అసలు ఏం జరిగింది? శ్రీదేవి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బోనీ కపూర్ బంధువు మోహిత్ మార్వా వివాహ వేడుకలో పాల్గొనేందుకు శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. అక్కడ ఆమె హోటల్ గదిలోని బాత్‌టబ్‌లో శవమై కనిపించారు. దుబాయ్ పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత, శ్రీదేవి బాత్‌టబ్‌లో స్పృహ తప్పి పడిపోవడంతో, నీటిలో మునిగి మరణించారని తేల్చారు. అలాగే ఆమె శరీరంలో మద్యం ఆనవాళ్లు కూడా ఉన్నాయని తెలిపారు.

శ్రీదేవి ఆత్మ ఏం చెప్పింది? “ప్రారంభంలో నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు శ్రీదేవి ఆత్మ ఏమీ చెప్పలేదు, పదే పదే అడిగాను. ఆ తర్వాత ‘మిమ్మల్ని ఎవరు కొట్టి బాత్‌టబ్‌లో ముంచేశారు?’ అని ప్రశ్నించగా.. ఆ ఆత్మ ‘బోనీ కపూర్’ అని స్పష్టంగా చెప్పింది. నేను ఈ విషయాలన్నీ చెబితే ఎవరూ నమ్మరు, అందుకే నా దగ్గర ఆడియో రికార్డ్ కూడా ఉంది” అని సౌరభ్ పూనియా పేర్కొన్నారు.

(గమనిక: ఇది ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వెల్లడించిన వ్యక్తిగత అభిప్రాయాలు మరియు ఆరోపణలు మాత్రమే. దీనికి ఎటువంటి శాస్త్రీయ లేదా చట్టబద్ధమైన ఆధారాలు లేవు.)


Posted

in

by

Tags: