‘లైంగికంగా వేధించాడు, పిల్లల వీడియోలను రికార్డ్ చేసి దాచాడు’; సంగీత దర్శకుడిపై గాయని తీవ్ర ఆరోపణలు

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ సంగీత దర్శకుడి నుండి తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని తమిళ గాయని స్వాగత ఎస్ కృష్ణన్ సంచలన వెల్లడి చేశారు.

ఆ సంగీత దర్శకుడి పేరు నేరుగా చెప్పనప్పటికీ, ఆమె అతడిని మద్రాస్ లోని ‘ఎప్స్టీన్’ (Epstein) అని అభివర్ణించారు. ఈ వేధింపుల కారణంగానే తాను తమిళ సినీ పరిశ్రమను వదిలి రిషికేశ్‌కు వెళ్లిపోయానని ‘శివశంకరి టాక్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు.

స్వాగత వెల్లడించిన షాకింగ్ విషయాలు:
  • నమ్మకద్రోహం: తాను ఆ సంగీత దర్శకుడి వద్ద పనిచేసేదాన్నని, వేధించడానికి ముందు అతను తన నమ్మకాన్ని గెలుచుకున్నాడని ఆమె తెలిపారు. జీవితంలో కష్టాల్లో ఉన్న సమయంలో తనకు మానసిక మద్దతు ఇచ్చి, తన నుండి పలుమార్లు డబ్బు కూడా అప్పుగా తీసుకున్నాడని చెప్పారు.
  • లైంగిక దాడి: ఆ తర్వాత తనపై శారీరక దాడికి (లైంగిక వేధింపులు) పాల్పడ్డాడని, దీనివల్ల తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని స్వాగత ఆవేదన వ్యక్తం చేశారు.
  • పిల్లలపై నిఘా: తనది ఒక్కరిదే సమస్య కాదని, చాలామంది మహిళలను అతను ఇలాగే వేధించాడని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, స్టూడియోకు వచ్చే చిన్న పిల్లల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేసి చూడటం అతనికి ఒక అలవాటని (Hobby) ఆమె భయంకరమైన ఆరోపణ చేశారు. ముఖ్యంగా స్వతంత్రంగా ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని వారిని ఆర్థికంగా, శారీరకగా దోచుకుంటాడని తెలిపారు.
  • తప్పుడు కేసులు: తాను పని మానేసిన తర్వాత, తనపై తప్పుడు దొంగతనం కేసులు మోపాడని, ఇతరులకు తన గురించి చెడుగా చెప్పాడని ఆమె వివరించారు.
న్యాయపోరాటానికి సిద్ధం:

ఆ సమయంలో తగిన ధైర్యం, మద్దతు లేకపోవడం వల్ల ఫిర్యాదు చేయలేదని, కానీ ప్రస్తుతం తాను చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు స్వాగత స్పష్టం చేశారు. 15 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న స్వాగత.. సౌండ్ ఇంజనీర్‌గా, గాయనిగా (బాచిలర్, కాట్రిన్ మొళి చిత్రాల్లో) గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె రిషికేశ్‌లో నివసిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు.


Posted

in

by

Tags: