కర్ణాటకలో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక రాత్రి నగ్నంగా పూజలో కూర్చుంటే 30 లక్షల రూపాయలు ఇస్తానంటూ ఒక కామాంధుడు తన పొరుగున ఉండే యువతికి ఆఫర్ ఇచ్చాడు. చైత్ర అనే యువతికి ఆమె పొరుగునే నివసించే కిరణ్ అనే వ్యక్తి ఈ వింత ఆఫర్ ఇచ్చి వేధింపులకు గురిచేశాడు.
యువతి చైత్ర తన పొరుగున ఉండే కిరణ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. బెంగళూరు దక్షిణ జిల్లాలోని రామ నగర పరిధిలోని దొడ్డమన్నగుడ్డే దొడ్డిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైత్రను ఉపయోగించుకుని క్షుద్రపూజలు లేదా చేతబడి చేయించాలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏం జరిగింది? నిందితుడు కిరణ్ కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 12న చైత్రకు ఫోన్ చేసి, ఒక రాత్రి నగ్నంగా పూజలో కూర్చుంటే తనకు 30 లక్షల రూపాయలు వస్తాయని, ఆ డబ్బులో వాటా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అంతేకాకుండా, వాట్సాప్‌లో ఫోటోలు షేర్ చేస్తూ.. “శరీరంపై పుట్టుమచ్చలు ఉంటే పూజకు పనికిరావు” అని చెబుతూ, ఆమెను నగ్న చిత్రాలు పంపమని వేధించాడు. ఫోన్ ద్వారా కూడా ఆమెను తీవ్రంగా టార్చర్ చేశాడు. ఆ తర్వాత “నువ్వు పూజకు సెలెక్ట్ అయ్యావు” అంటూ నమ్మబలికాడు. ఈ వేధింపులు తాళలేక చైత్ర తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
