7 ఏళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య.. నిందితుడిని కాల్చిచంపిన పోలీసులు

లక్నో: 7 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లా మల్లవాన్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు మరియు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సంయుక్తంగా జరిపిన కాల్పుల్లో మెహ్నూర్ అనే నిందితుడు హతమయ్యాడు. ఈ ఎదురుకాల్పుల సమయంలో గాయపడిన ఒక పోలీసు అధికారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. లోంగిపోవాల్సిందిగా పోలీసులు కోరినప్పటికీ, నిందితుడు వారిపైకి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది.

మెహ్నూర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మైనర్ బాలుడిని నిందితుడు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. హతమైన మెహ్నూర్ పై రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దాదాపు 12 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.


Posted

in

by

Tags: