షాకింగ్: 26 ఏళ్ల యువతితో ప్రేమకు ఇంట్లో నిరాకరణ.. మనస్తాపంతో 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

బెంగళూరు: 26 ఏళ్ల యువతితో ప్రేమను ఇంట్లో వారు వ్యతిరేకించిన నేపథ్యంలో, విషం సేవించి 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చన్నపట్న పట్టణంలోని రాజా కెంపేగౌడ లేఅవుట్‌లో జరిగింది. మరణించిన బాలుడు బిడది ప్రాంతానికి చెందినవాడని తెలిసింది.

ఈ ఘటన మే 4వ తేదీన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిడదికి చెందిన శోభ అనే యువతితో సదరు బాలుడు ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలుడిని మందలించి, బుద్ధి చెప్పారు. మీ ఇద్దరికీ వయస్సు తేడా చాలా ఉందని, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఆపేయాలని హెచ్చరించారు. అయినప్పటికీ, బాలుడు మరియు యువతి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇల్లు వదిలి వచ్చిన బాలుడు చన్నపట్నలోని తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నాడు.

యువతితో ఇదే విషయంపై గొడవపడి ఏప్రిల్ 29న విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్నేహితులు అతడిని చన్నపట్న తాలూకా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలిించక మే 4న బాలుడు మరణించాడు. తన కొడుకు మరణానికి ఆ యువతియే కారణమని బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, శోభ అనే యువతిపై చన్నపట్న రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.


Posted

in

by

Tags: