చెన్నై: తమిళనాడు 18వ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
వీరిలో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారు – ఆమె 29 ఏళ్ల సెల్వి ఎస్. కీర్తన. తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఘనత సాధిస్తూ సెల్వి ప్రమాణ స్వీకారం చేశారు.
శివకాశి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కీర్తన, టీవీకే (TVK) పార్టీ తరపున అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా కూడా రికార్డు సృష్టించారు. ఎమ్మెస్సీ (M.Sc) చదివిన సెల్వి గతంలో పొలిటికల్ కన్సల్టెంట్‌గా పనిచేశారు.
మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. తొలిసారి ఎన్నికలను ఎదుర్కొన్న విజయ్ నేతృత్వంలోని టీవీకే అత్యంత పెద్ద పార్టీగా అవతరించింది.
