వదినా-మరిది ప్రేమ వ్యవహారం: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లా నుండి ఒక దిగ్భ్రాంతికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడు, వరుసకు మరిది అయ్యే వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఒక మహిళ ఆగ్రహంతో ఊగిపోయింది. అతడిని మాట్లాడదామని పొలాల్లోకి పిలిచి బ్లేడ్‌తో అతడి జననాంగాలను కోసేసింది. ఈ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనలు నెలకొన్నాయి.
మోసానికి వదిన తీర్చుకున్న పగ
ఈ ఘటన పాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజ్ దేయ్ గ్రామంలో జరిగినట్లు సమాచారం. 20 ఏళ్ల సుధీర్ గత నాలుగేళ్లుగా ఒక మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమె వరుసకు అతడికి వదిన అవుతుంది. ఆ మహిళకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. మే 6వ తేదీన సుధీర్‌కు మరో యువతితో వివాహం జరిగింది. సుధీర్ పెళ్లి వార్త విన్న అతని ప్రేమికురాలు (వదిన) పగతో రగిలిపోయింది. సుధీర్ తనను మోసం చేశాడని ఆమె భావించింది.
పొలాల్లోకి పిలిచి దారుణం..
శనివారం నాడు ఆ మహిళ సుధీర్‌ను మాట్లాడాలని కుర్సేలీ గ్రామం సమీపంలోని పొలాల్లోకి పిలిచింది. సుధీర్ ఎంతో సంతోషంగా అక్కడికి వెళ్లాడు. అయితే అక్కడ పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. గొడవ పెరగడంతో ఆ మహిళ ఒక్కసారిగా బ్లేడ్ తీసి సుధీర్ జననాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సుధీర్ నొప్పితో విలవిలలాడుతూ కింద పడిపోయాడు.
వదిన హై ఓల్టేజ్ డ్రామా
దాడి తర్వాత సుధీర్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి రోడ్డు వైపు పరుగులు తీశాడు. ఆ మహిళ కూడా అతని వెంటే పరుగెత్తింది. రోడ్డుపై ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వివాదం జరిగింది. ఇది చూసి జనం గుమిగూడారు. పరిస్థితి గమనించిన మహిళ వెంటనే మాట మార్చేసింది. తాను బ్యాంకుకు వెళ్తుండగా సుధీర్ తనను ఆపి బలవంతం చేయడానికి ప్రయత్నించాడని, ఆత్మరక్షణ కోసమే తాను దాడి చేశానని జనం ముందు డ్రామా ఆడింది.
తీవ్రంగా గాయపడిన సుధీర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఇది అక్రమ సంబంధం మరియు వ్యక్తిగత కక్షల వల్ల జరిగినట్లుగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
